
సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల కోసం చేసిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. అభివృద్ధికి సమస్యగా మారిన తీవ్రవాద సంస్థలతో చర్చించడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. మణిపూర్ పర్యటనలో ఉన్న అమిత్ షా అక్కడ నిర్వహించిన ఓ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తీవ్రవాద కార్యకలాపాల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, అభివృద్ధి అడుగున పడిపోయిందని వ్యాఖ్యానించారు.