
కాంగ్రెస్ పార్టీ 136వ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ నేత ఏకే ఆంటోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు. ముందుగా పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నూతన చట్టాలను తీసుకొచ్చిన కేంద్రం సామాన్యుల హక్కులను కాలరాస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రతీ కార్యకర్త నిరంతరం పోరాడుతూనే ఉండాలని సూచించారు. జెండావిష్కరణ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు ఆజాద్, ఖర్చే తదితరులు పాల్గొన్నారు. కాగా అనారోగ్య కారణాల వల్ల సోనియాగాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఇక రాహుల్ విదేశాల్లో ఉన్నారు.