Homeజాతీయం - అంతర్జాతీయంరైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

రేపు ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ నిధులు అర్హులైన రైతుల అకౌంట్లలో 2వేల చొప్పున జమకానున్నాయి. ఈ నేపథ్యంలో ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ కింద రైతులకు అందనున్న ఆర్థిక ప్రయోజనాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రేపు (డిసెంబర్ 25) విడుదల చేయనున్నారు పీఎం నరేంద్ర మోడీ. 9 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయలు పైగా ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ నుంచి బదిలీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆరు రాష్ట్రాల రైతులతో కూడా సంభాషించనున్నారు ప్రధాని మోడీ. ప్రధానితో రైతులు ‘పీఎం కిసాన్ పథకం’ తో తమ అనుభవాలను పంచుకుంటారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తెచ్చిన వివిధ పధకాల గురించి రైతులతో నేరుగా మాట్లాడనున్నారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా హాజరుకానున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular