
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ పౌర పట్టిక, జాతీయ జనాభా పట్టిక, పౌరసత్వ సవరణ చట్టం గురించి రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం శరణార్థుల కాలనీలను గుర్తించిందని వెల్లడించారు. అల్లర్లతో సతమతమైన గుజరాత్‌లా ఈ రాష్ట్రాన్ని కూడా మార్చాలని భాజపా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. వర్గాల మధ్య అల్లర్లు, విద్వేషాలను భాజపా సృష్టిస్తోందని ఆమె విరుచుకుపడ్డారు. మంగళవారం జల్‌పాయ్‌గురిలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ..అధికార పార్టీ చర్యలను తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి తప్పుపట్టారు.