
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా నాలుగు గంటల పాటు బంద్ పాటించారు. ఈ బంద్‌కు మద్దతుగా రహదారులపై బైఠాయించిన రైతులు, వారి మద్దతుదారులు సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఒకరోజు నిరాహారదీక్షకు దిగగా.. సాగు చట్టాలను రద్దు చేయాలని శిరోమణి అకాలీదళ్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ ప్రభావం కొన్ని రాష్ట్రాల్లోనే కనిపించింది.