
బడ్జెట్ లోటును పరిమితం చేయాలన్న లక్ష్యం నెరవేరకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. దీనికి కారణాన్ని వివరిస్తూ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచేందుకు ఖర్చులను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఉద్దీపన ఖర్చులను ఆత్రుతగా తగ్గించవలసిన అవసరం లేదని, ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) సామరస్యంగా సరైన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు.