Tarique Rahman India friendship: బంగ్లాదేశ్‌లో 18 నెలల మహ్మద్ యూనస్ పాలన తర్వాత నిర్వమించిన పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) ఘన విజయం సాధించింది. తారీఖ్ రహ్మాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధానిగా తారీఖ ప్రమాణస్వీకారం చేశారు. 50 మందితో కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. ఇందులో మైనారిటీలు అయిన బౌద్ధ, హిందూ సమాజానికి చెందిన ఇద్దరికి అవకాశం కల్పించారు. తద్వారా భారత్‌తో సత్సంబంధాలకు ఆయన సంకేతాలు ఇచ్చారు.
మైనారిటీ మంత్రులు..
హిందూ సంఘ నేత నితాయి రాయ్‌చౌదరి (బీఎన్‌పీ సీనియర్ వైస్ చైర్మన్)ని సాంస్కృతిక మంతత్రిగా నియమించారు. బౌద్ధ చక్మా నేత దీపెన్ దేవాన్ చిట్టాగాంగ్ హిల్ ట్రాక్ట్స్ మంత్రిగా నియమించారు. బంగ్లాదేశ్‌లో హిందూవులు 8 శాతం ఉంటారు. బౌద్ధుల రక్షణకు తారీఖ్ చర్య కీలకం.
భారత్‌ను చల్లబరిచే చర్య..
మహ్మద్ యూనస్ ప్రభుత్వం 18 నెలల పాలనలో సాగించిన అరాచకాలతో బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఫెరిగాయి. చాలా మంది హత్యకు గురయ్యారు. ఇక మహ్మద్ యూనస్ చైనా, పాకిస్తాన్‌తో చేతులు కలిపి భారత్‌పై విద్వేషాన్ని ఫెంచారు. దీంతో భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్ ఏటా బంగ్లాదేశ్‌కు అందించే ఆర్థిక సాయాన్ని సగానికి తగ్గించింది. అదాని విద్యుత్ సరఫరా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో భారత్‌తో మంచి సంబంధాలు బంగ్లాదేశ్ ఆర్థిక, రాజకీయ భద్రతకు అవసరమని తారీఖ్ ప్రభుత్వం గుర్తించింది. మైనారిటీలపై దాడులు, ఆస్తి హింసలు భారత విమర్శలకు దారితీయకుండా చర్యలు చేపడుతోంది.
తారీఖ్ ప్రభుత్వం మరోవైపు దేశంలో జమాత్–ఇ–ఇస్లామీ పార్టీ బలపడకుండా చర్యలు తీసుకుంటున్నారు. తీవ్రవాద ఆగడాలను అరికట్టాలంటే బీఎన్‌పీ నిజాయితీ పరీక్షించాలి. లేకపోతే అంతర్గత అశాంతి పెరిగి భారత్‌తో సంబంధాలు దెబ్బతింటాయి.