Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi industry hit controversy: చిరంజీవి కి ఇండస్ట్రీ హిట్ రానివ్వకుండా చేసిన రజినీకాంత్, మోహన్...

Chiranjeevi industry hit controversy: చిరంజీవి కి ఇండస్ట్రీ హిట్ రానివ్వకుండా చేసిన రజినీకాంత్, మోహన్ బాబు..అసలు ఏమైందంటే!

Chiranjeevi industry hit controversy: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చూడని బ్లాక్ బస్టర్లు , ఇండస్ట్రీ హిట్లు లేవు. నాలుగు దశాబ్దాలలో ఆయన సాధించిన విజయాలతో, ఆయన మాత్రమే ఎదగడం కాకుండా , తెలుగు సినిమా ఇండస్ట్రీని కూడా తనతో పాటు ఎదిగేలా చేసాడు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయనకు ఇప్పటికీ చెక్కు చెదరని ప్రేక్షకాదరణ ఉంది. అయితే ఎన్ని హిట్స్ ఉన్నప్పటికీ అభిమానులు ఆయన్ని కొన్ని పాత్రల్లో చూడాలని కోరుకునేవారు. అప్పట్లో బాషా సినిమా మెగాస్టార్ చిరంజీవే చేయాల్సింది. రీమేక్ రైట్స్ ఎక్కువ చెప్పడంతో అల్లు అరవింద్ ఒప్పుకోలేదు. ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి ఉండుంటే ఏ రేంజ్ ఇండస్ట్రీ హిట్ అయ్యేదో మీరే ఊహించుకోండి. అభిమానులు ఈ సినిమా మెగాస్టార్ కి మిస్ అయ్యిందనే విషయం తెలిసినప్పుడు చాలా బాధ పడ్డారు.

కేవలం ఆ సినిమా మాత్రమే కాదు, మెగాస్టార్ మిస్ అయిన సూపర్ హిట్ చిత్రం ‘పెద్దరాయుడు’. మోహన్ బాబు హీరో గా నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద ఇండస్ట్రీ హిట్. ఈ సినిమాతో మోహన్ బాబు సూపర్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయాడు. తమిళంలో సూపర్ హిట్ గా నిల్చిన ‘నట్టమై’ చిత్రానికి ఇది రీమేక్. కేఎస్ రవికుమార్ దర్శకుడు. అక్కడ మోహన్ బాబు పాత్రలో శరత్ కుమార్ నటించగా, సూపర్ స్టార్ రజినీకాంత్ పాత్రలో విజయ్ కుమార్ నటించాడు. ఈ సినిమా చిరంజీవి కి బాగా నచ్చడం తో, రీమేక్ రైట్స్ కోసం కేఎస్ రవికుమార్ ని సంప్రదించాడు. ముందు ఇవ్వడానికి ఆసక్తి చూపించాడు, కానీ ఆ మరుసటి రోజు రీమేక్ రైట్స్ మోహన్ బాబు కి అమ్మేశానని చిరంజీవి కి ఫోన్ చేసి చెప్పాడట కేఎస్ రవికుమార్. అదేంటి నాకు ఇస్తానని చెప్పావు కదా, మోహన్ బాబు కి ఎలా ఇచ్చావ్ అని చిరంజీవి అడగ్గా, రజినీకాంత్ ఈ కథ మోహన్ బాబు కి ఇవ్వాలని చాలా రిక్వెస్ట్ చేశాడని, అందుకే ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

దీంతో చిరంజీవి మనసు కాస్త నొచ్చుకున్నా, తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా ఒకవేళ చిరంజీవి చేసుంటే ఎంత పెద్ద హిట్ అయ్యేదో అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ కొంతమంది విశ్లేషకులు అయితే, చిరంజీవి కి ఈ గెటప్ పెద్దగా సూట్ అయ్యేది కాదని, ఆయన మిస్ చేసుకొని మంచి పని చేశాడని, ఆయన చేసుంటే ఈ చిత్రం ఫ్లాప్ అయ్యేదని అంటున్నారు. కానీ చిరంజీవి కి సూట్ అవ్వని గెటప్, చెయ్యలేని పాత్ర అంటూ ఏది లేదని అభిమానుల వాదన. మెగాస్టార్ ని కెరీర్ లో ఒక్కసారైనా పెద్ద రాయుడు తరహా గెటప్ లో చూడాలని అభిమానుల్లో ఒక చిన్న కోరిక చాలా రోజుల నుండి మిగిలిపోయి ఉంది. అందుకే ఈ సినిమా మిస్ అయ్యింది అనే విషయాన్ని తెలుసుకొని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version