
దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచార ఘటన ప్రపంచ వ్యాప్తంగా కదిలించింది. ఇక దేశం మొత్తం ఒక్కతాటిపై ఉండి నిందితులకు ఉరిశిక్ష పడేలా పోరాటం చేసింది. నిర్భయ అత్యాచార ఘటన జరిగి నేటికి ఎనిమిదేళ్లు. ఈ సందర్భంగా నిర్భయ తల్లి ఆశాదేవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యాచార బాధితులందరి న్యాయం కోసం పోరాడుతానని ప్రకటించారు. అత్యాచారానికి గురైన తన కుమార్తెకు నివాళిగా అత్యాచార బాధిుతలందరి తరుపున పోరాడుతానని చెప్పారు. నా కుమార్తెకు న్యాయం జరిగిందని నేను మౌనంగా కూర్చోవడం నాకిష్టం లేదని, అత్యాచార బాధితులందరి తరుపున పోరాడుతానని చెప్పారు. నలుగురు అత్యాచార దోషులను ఉరి తీసిన తరువాత న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడిందన్నారు.