
కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల్లో ఒకరు మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీ శివారులోని టిక్రీ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన అజయ్ అనే రైతు మంగళవారం ఉదయం మరణించడంతో తోటి రైతులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని మ్రుతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులుగా అజయ్ ఆందోళనలో పాల్గొంటున్నాడు. తీవ్రమైన చలి కారణంగా అతడు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా గతవారం ఇదే టిక్రి ప్రాంతంలో పంజాబ్ కు చెందిన రైతు గుండే పోటుతో మరణించాడు.