
దుర్గామాత విగ్రహం నిమజ్జనం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో అపశృతి నెలకొంది. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి రాష్ట్రంలోని ముర్షీదాబాద్‌లోని డుమ్నీ చెరువులో 10 మంది పడవపై వెళ్లారు. ప్రమాదవశాత్తూ పడవ మునగడంతో ఐదుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వీరంతా బెల్డంగా ప్రాంతానికి చెందిన వారని స్థానిక పోలీసుల తెలిపారు.