
దేశంలో కరోనా కేసులు నిన్నటితో పోలిస్తే తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 45,209 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 501 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90,95,807 గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,33,227 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,40,962 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 85,21,617 గా ఉంది. కాగా ప్రస్తుత మరణాల రేటు 1.46 శాతంగా ఉంది.