
తెలుగులో నటించిన ఓ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘కత్తి’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సనాఖాన్ ఇటీవల వివాహం చేసుకుంది. దీంతో తాను సినిమాలను వదిలిపెట్టిన్లు తెలుస్తోంది. కత్తి సినిమాతో పటు గగనం, మిస్టర్ నూకయ్య లాంటి తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. తన వివాహం తరువాత సినీ ప్రపంచానికి దూరం అవుతున్నానని ప్రకటించింది. కరోనా కాలం కొందరిని ఇబ్బందికి గురి చేసినా టాలీవుడ్ హీరోయిన్ లు వివాహంతో జీవితంలో స్థిరపడుతున్నారు. ఇప్పటికే ప్రముఖ హీరోయిన్ కాజల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.