
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 32,981 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 8 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 96,77,203కు చేరింది. ఇందులో 3,96,729 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 91,39,901 మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో నిన్న 39,109 మంది కరోనా నుంచి బయటపడి దవాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 391 మంది కొత్తగా మరణించారు. దీంతో మొత్తం మరణాలు 1,40,573 మంది బాధితులు మహమ్మారి వల్ల మృతిచెందారు.