
ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. నగరంలోని పది ప్రాంతాలకు చెందిన వారు… స్పృహ కోల్పోవడం, మెడ, నడుంనొప్పి, తల, కళ్లు తిరగడం, వంటి లక్షణాలతో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం రాత్రి వరకు ఆస్పత్రులకు వస్తూనే ఉన్నారు. వారు చెబుతున్న లక్షణాలను బట్టి డాక్టర్లు చికిత్స అందిస్తుండటంతో బాధితులు కోలుకుంటున్నారు. అయితే ఒక్కసారి ఇంత మంది ఇలా అస్వస్థతకు గురవడానికి కారణాలేంటో ఇప్పటికి స్పష్టత రాలేదు.శనివారం అర్ధరాత్రి వరకు 108 మంది ఆసుపత్రిలో చేరగా ఆదివారం పొద్దుపోయేసరికి ఈ సంఖ్య 300 దాటింది. వీరిలో 180 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.