
ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబరు నుంచి నవంబర్ దాకా మూడు నెలల కాలంలో 101 ఆన్‌లైన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంటే సగటున రోజుకు ఒకటికి పైగా కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. అలాగే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోడీ సాంకేతికతను వినియోగించుకోవడం 25 శాతం ఎక్కువట. ప్రధానంగా ఆన్‌లైన్ కార్యక్రమాల్లో వివిధ పథకాల ప్రారంభోత్సవాలు, ప్రాజెక్టుల శంకుస్థాపనలు, కోవిడ్-19 మహమ్మారిపై ముఖ్యమంత్రులతో సమావేశాలు, అంతర్జాతీయ నేతలతో శిఖరాగ్ర సదస్సులు, యువ వ్యాపారవేత్తలతో చర్చలు వంటి వివిధ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయని తెలిపాయి. కేవలం ఇవే కాకుండా అంతర్గత సమావేశాలు కూడా గణనీయంగా పెరిగాయని సంబంధిత అధికారి తెలిపారు.