
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలపై ప్రధాని నరేంద్ర ఆరాతీశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్ చేసి.. ఎన్నికల గురించి వివరాలు తెలేసుకున్నారు. మంగళవారం జరిగిన పోలింగ్ సరళి, పార్టీల స్థితిగతులపై ముచ్చటించారు. ఎన్నికల సందర్భంగా నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి కూడా ప్రధాని మోదీ అడిగినట్లు తెలుస్తోంది. నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.