
ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న తగాదంతో ఓ బాలిక బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహాత్ ఏరియాలో చేను దగ్గర బాలిక మృతదేహాన్ని చూసి తండ్రి తల్లడిల్లాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తనకు, సోదరులకు మధ్య భూ వివాదాలున్నాయని వాళ్లే నా బిడ్డను హత్య చేసి ఉంటారని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మరోసారి వార్తల్లోకెక్కింది. ఇప్పటికే హత్రాస్ ఘటనతో అట్టుడుకుతున్న రాష్ట్రం మరోసారి బాలిక హత్యతో చర్చనీయాంశంగా మారింది.