https://oktelugu.com/

Karnataka CM Post : కర్ణాటక ముఖ్యమంత్రి ఎవ్వరు?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయే స్థితికి రావడానికి సిలిండర్ ధరల పెరుగుదల, పెట్రోలు, డీజిల్ పెరుగుదల ప్రభావం చూపిందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 13, 2023 / 01:51 PM IST

    Karnataka CM Post

    Follow us on

    Karnataka CM Post : కాంగ్రెస్‌కు తగిన మెజారిటీ వస్తే కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారా? ప్రజాధరణ ఎక్కువగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారా? అన్న చర్చ ఉత్కంఠకు దారితీస్తోంది. కర్ణాటకలో క్లియర్ కట్ గా కాంగ్రెస్ గెలుస్తోందని తేలింది. 131 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోయింది.

    బీజేపీకి బలంగా ఉన్న లింగాయత్ ఓట్లలో చీలిక ఏర్పడింది.. 30 శాతం వరకు కాంగ్రెస్‌కు పడ్డాయని అంటున్నారు. లింగాయత్‌ల ఓట్లలో చీలిక ఏర్పడినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీరిలో 30 నుంచి 40 శాతం ఓట్లు బీజేపీ నుంచి కాంగ్రెస్‌కు మొగ్గు చూపినట్టు అంచనా వేస్తున్నారు.

    -కాంగ్రెస్‌కు దక్కిన దళితుల మద్దతు
    ఎస్సీ ఓట్లు గతంలో బీఎస్పీకి మద్దతుగా పడేవి. గత ఎన్నికల అనంతరం బీఎస్పీ ప్రభావం కనుమరుగైంది. ఈ నేపథ్యంలో దళితులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు.

    -ధరల పెరుగుదల, నిరుద్యోగిత ప్రభావం
    నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి, పట్టణ ప్రాంతాలలో మంచినీటి సమస్య తదితర అంశాలపై అధికార బిజెపి పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో విశ్లేషించింది. ఈ వ్యతిరేకత కారణంగానే బిజెపి అధికారం కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయని ముందుగానే అంచనా వేసింది.

    -40 శాతం సర్కారు నినాదం ఫలించిందా?
    ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని అవినీతిని ఎండగడుతూ చేసిన ‘40% సర్కారు’ కమీషన్‌ నినాదం ద్వారా కాంగ్రెస్‌ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లగలిగింది. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆకర్షనీయమైన మేనిఫెస్టో వల్ల ఆ పార్టీకి లాభం చేకూరింది.

    -సిలిండర్, పెట్రోలు ధరల ప్రభావం?
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోల్పోయే స్థితికి రావడానికి సిలిండర్ ధరల పెరుగుదల, పెట్రోలు, డీజిల్ పెరుగుదల ప్రభావం చూపిందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    -ఎస్సీ, ఎస్టీ సీట్లలో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం
    ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ సీట్లలో ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ 43 శాతం ఓట్లతో ముందంజటలో ఉంది. బీజేపీ 36.1 శాతం ఓట్లు దక్కించుకుంది. జేడీఎస్ 13 శాతం ఓట్లు దక్కించుకుంది.

    -స్పష్టంగా కాంగ్రెస్‌కు ఆధిక్యం
    కాంగ్రెస్‌కు ఇప్పటి వరకు 119 సీట్లలో స్పష్టమైన ఆధిక్యం కనబడుతోంది. అయితే చివరి వరకు ఫలితాలు ఉత్కంఠగా మారనున్నాయి.

    – ప్రజలు బీజేపీతో విసిగిపోయారు: సిద్దరామయ్య
    కర్ణాటకలో నరేంద్ర మోడీ, అమిత్ షాల ప్రచారం ఏ మాత్రం మార్పు తీసుకురాలేదని సిద్ధరామయ్యా అన్నారు. బీజేపీతో ప్రజలు విసిగిపోయారన్నారు. తాను మొదటి నుంచి చెబుతున్నది నిజమైందని సిద్ధరామయ్య విశ్లేషించారు.

    ఇక డీకే శివకుమార్ పీసీసీ చీఫ్ గా ఉన్నా జూనియర్. సిద్ధరామయ్య సీనియర్ మాజీ సీఎం. ఈ ఇద్దరిలో సీనియర్ అయిన నీట్ ఇమేజ్ ఉన్న సిద్ధరామయ్యకే సీఎం పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం.