HomeజాతీయంAnubhav Mittal: రూ.5 ఆశ చూపి.. రూ.3,700 కోట్లు కొట్టేశాడు.. ఎవరీ అనుభవ్‌ మిట్టల్‌ ?

Anubhav Mittal: రూ.5 ఆశ చూపి.. రూ.3,700 కోట్లు కొట్టేశాడు.. ఎవరీ అనుభవ్‌ మిట్టల్‌ ?

Anubhav Mittal: రూపాయి పెట్టుబడి పెడితే.. ఎలాంటి కష్టం లేకుండా ఐదు రూపాయల లాభం వస్తుందని చెబితే నమ్మేవాళ్లు ఉన్నంత కాలం సమాజంలో మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. అధిక వడ్డీ, ఎక్కువ ఆదాయానికి ఆశపడితే మొదటికే మోసపోతున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఆన్‌లైన్‌లో పార్ట్‌ టైం, ఫుల్‌టైం జాబ్‌ల పేరుతో ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయి. కానీ, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనుభవ్‌ మిట్టల్‌ ఇంటర్నెట్‌ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న దశలోనే ఇలాంటి స్కాంకు తెరలేపాడు. రూ.5 లాభం ఆశ చూపి 7 లక్షల మంది నుంచి రూ.3,700 కోట్లు కొట్టేశాడు. దీని కథ ఏంటో తెలుసుకుందాం.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నుంచి..
అనుభవ్‌ మిట్టల్‌ మంచి తెలివైన యువకుడు. బీటెక్‌ చదివాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఊపందుకున్న 2015 ఆగస్టులో సోషల్‌ ట్రేడ్‌ డాట్‌ బిజ్‌(socialtrade.biz) అనే ఒక వెబ్‌సైట్‌ను స్టార్ట్‌ చేశాడు. అంతకు ముందు ఓ సాఫ్ట్‌రేక్‌ కంపెనీ పెట్టాడు. దానిపేరు అబ్లాజ్‌ ఇన్‌ఫో సొల్యూషన్స్‌. అది అంతగా సక్సెస్‌ కాలేదు. దానిని బేస్‌ చేసుకుని సోషల్‌ ట్రేడ్‌ డాట్‌ బిజ్‌ వెబ్‌సైట్‌ స్టార్ట్‌ చేశాడు. దీని ఉద్దేశం.. డౌన్‌ అవుతున్న సోషల్‌ మీడియా సంస్థలకు క్లిక్స్‌ పెంచడం ద్వారా ఆదాయం పొందడం. ఈ లింక్స్‌ పొందడానికి సంస్థల నుంచి డబ్బులు తీసుకుని ఆయా సంస్థల లింక్స్‌ను ఇతరులకు పంపి ఆ లింక్‌ క్లిక్‌చేసి 30 సెకండ్లు ఉండేలా ప్రమోట్‌ చేస్తాడు. ఇలా చేసిందుకు క్లిక్‌ చేసిన వారికి ఒక్కో క్లిక్‌కు రూ.5 చొప్పున ఇవ్వాలని నిర్ణయించాడు.

నాలుగు స్లాబ్‌లలో..
ఈ వెబ్‌సైట్‌లో జాయిన్‌ కావడానికి అనుభవ్‌ మిట్టల్‌ నాలుగు ప్లాన్స్‌ రూపొందించాడు. మొదటి ప్లాన్‌ 5,750 చెల్లించాలి. దీని ద్వారా రోజుకు 10 లింక్స్‌ వస్తాయి. దీనికి రూ.42.2 చెల్లింస్తారు. రెండోది రూ.11,500 చెల్లించాలి. దీనికి రోజుకు 20 లింక్స్‌ వస్తాయి. వీటిని క్లిక్‌ చేసినందుకు రూ.84.8 చెల్లిస్తారు. మూడోది 28,750 చెల్లించాలి. దీనికి రోజుకు 50 లింక్స్‌ పంపిస్తారు. వీటిని క్లిక్‌ చేస్తే రూ.212 చెల్లిస్తారు. నాలుగోది రూ57,500 చెల్లించి జాయిన్‌ కావాలి. దీనికి రోజుకు 125 లింక్స్‌ పంపుతారు. వాటిని క్లిక్‌చేసి 30 సెకండ్లు చూస్తే అందుకు రూ.530 చెల్లిస్తారు. ఈ అగ్రిమెంట్‌ ఏడాదిపాటు ఉంటుంది. ఏడాదిలో మీ ఆదాయం రెట్టింపు వస్తుంది.

భారీగా పెట్టుబడి..
ప్లాన్‌ అంతా క్లియర్‌గా ఉండడం, ఆదాయం వస్తుండడంతో చాలా మంది ఇందులో జాయిన్‌ కావడం మొదలు పెట్టారు. దీంతో అనుభవ్‌ మిట్టల్‌ కొత్త స్కీం తెచ్చారు. ఇప్పటికే జాయిన్‌ అయిన వారు మరో ఇద్దరిని జాయిన్‌ చేసిస్తే పెట్టుబడి పెట్టకుండానే లింక్స్‌ వస్తాయని తెలిపాడు. దీంతో చాలా మంది ఇద్దరిని జాయిన్‌ చేయించడం ప్రారంభించారు. నలుగురిని జాయిన్‌ చేసిస్తే రోజుకు 500 లింక్స్‌ వస్తాయని చెప్పడంతో కొంతమంది నలుగురిని జాయిన్‌ చేయించారు. ఇలా చేరికలు భారీగా పెరిగాయి. పెట్టుబడిగా డబ్బులు మిట్టల్‌ ఖాతాలో కోట్లుగా చేరాయి. ఇంకేముంది.. మంచి స్కీం కాస్త స్కాంగా మారిపోయింది.

పెద్ద మొత్తలో పెట్టుబడి..
జాయినింగ్స్‌ పెరగడంతో భారీగా డబ్బులు మిట్టల్‌ ఖాతాలో నిత్యం జమవుతున్నాయి. చాలా మంది రూ57,500 ప్లాన్‌ తీసుకున్నారు. దీంతో రోజుకు పది లక్షల నుంచి కోటి రూపాయల వరకూ ఖాతాలో జమయ్యేవి. దీంతో కొన్ని రోజులు మిట్టల్‌ కూడా క్లిక్‌ చేసిన వారికి చెల్లింపులు చేస్తూ వచ్చాడు. దీంతో అందరికీ నమ్మకం పెరిగింది. మరోవైపు పెట్టుబడులు పెరిగాయి. ఇలా కేవలం 90 రోజుల్లో మిట్టల్‌ ఖాతాలో రూ.3,700 కోట్లు జమయ్యాయి. ఈ క్రమంలో మూడు రోజులు చెల్లింపులు ఆగిపోయాయి. దీంతో అందరూ షాక్‌ అయ్యారు. కంపెనీ సైట్‌కు ప్రాబ్లమ్‌ వచ్చిందా లేక చీటింగ్‌ చేసి కంపెనీని మూసేశాడా అన్న అనుమానాలు కలిగాయి.

మూడు రోజులకు బయటకు వచ్చి..
ఈ క్రమంలో అనుభవ్‌ మిట్టల్‌ ఓ వీడియో సందేశాన్ని మూడు రోజుల తర్వాత విడుదల చేశాడు. కంపెనీ సైట్‌లో చిన్నచిన్న ప్రాబ్లమ్స్‌ వచ్చాయని, వాటిని సరిచేస్తున్నామని, క్లిక్స్‌ ఎవరూ ఆపొద్దని కోరాడు. పెండింగ్‌ డబ్బులన్నీ ఒకేసారి చెల్లిస్తామని తెలిపాడు. దీంతో క్లిక్స్‌ కొనసాగాయి. తర్వాత కొన్ని రోజులకే ఓ వార్త వైరల్‌ అయింది. అందులో ఏముందంటే.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అనుభవ్‌ మిట్టల్‌ 90 రోజుల్లో 7 లక్షల మంది నుంచి రూ.3,700 కోట్లు వసూలు చేసి కంపెనీ మూసేశాడని ఉంది. దీంతో అంతా షాక్‌ అయ్యారు. కొందరు కంపెనీ చిరునామా ఉన్న నోయిడాకు వచ్చారు. అక్కడ ఎవరూ కనిపిచంలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు వారి వద్ద ఉన్న రూ.500 కోట్లు సీజ్‌ చేశారు.

గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకలు..
ఇదిలా ఉండగా అనుభవ్‌ మిట్టల్‌ నవంబర్‌ 29న ఢిల్లీలో తన పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఇందుకు సన్నీలియోన్, అమీషాపటేల్‌తోపాటు బాలీవుడ్‌ తారలు దిగి వచ్చారు. దీంతో కంపెనీ పెద్దది అని అందులో జాయిన్‌ అయినవారు నమ్మారు. మిడిల్‌ క్లాస్‌ మెంటాలిటీని పెట్టుబడిగా చేసుకుని మిట్టల్‌ చేసిన ఈ స్కాం దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular