Whatsapp Accounts Banned In India: వాట్సాప్.. ఇప్పుడు ఇది లేనిదే మనకు పూట గడవదు.. ఆఫీసు పనులైనా.. వ్యక్తిగత అవసరాలైనా.. ఏ పని చేయాలన్నా అంతా వాట్సాప్ మీదుగానే సాగుతోంది. క్షణాల్లో సమాచారాన్ని చేరవేయడం.. ఫోన్ కాల్స్, వీడియో కాల్స్.. అన్ని పంపించి మన అవసరాలు తీరుస్తోంది.. ఆఖరుకు డబ్బులను కూడా చేరవేస్తూ మనకు ఒక నిత్యావసర యాప్ గా ‘వాట్సాప్’ మారిపోయింది. అయితే వాట్సాప్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా గత నెల జనవరిలో దాదాపు 18.58 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించి షాకిచ్చింది.

వాట్సాప్ నిర్ధేశించిన చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా.. తమకు అందిన ఫిర్యాదుల కారణంగా అన్ని ఖాతాలను నిషేధించినట్టు తెలుస్తోంది. అందులో 495 వాట్సాప్ ఖాతాలపై ఫిర్యాదులు అందగా.. వాటిలో 24 అకౌంట్స్ ను నిషేధించారు. బ్యాన్ చేయబడిన ఖాతాల్లో ఎక్కువమంది వాట్సాప్ ను దుర్వినియోగం చేసినందుకే నిషేధించినట్టు సమాచారం.
జనవరి 1 నుంచి 31వ తేదీ వరకూ దాదాపు 18.58 లక్షల ఖాతాలు నిబంధనలను ఉల్లంఘించాయని వాట్సాప్ గుర్తించింది. ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ అకౌంట్స్ ను బ్లాక్ చేసింది. విచారణలో వ్యతిరేకంగా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ చర్యలు తీసుకుంది. ఇవన్నీ కూడా +91 ISD కోడ్ ద్వారా భారతీయ నంబర్లుగా ఉన్నట్టు వాట్సాప్ గుర్తించింది.
Also Read: New Rajya Sabha Member From AP: వైసీపీ నుంచి రాజ్యసభకు అదానీ సతీమణి
వాట్సాప్ లో మీకు అభ్యంతరకరమైన మెసేజ్ లు పంపే.. గ్రూపులో రెచ్చిపోయే వారిపై ‘వాట్సాప్ గ్రీవెన్స్ అధికారి’ని సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.. లేదా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసి వారి ఖాతాలను నిషేధించేలా చేయవచ్చు. ఫిర్యాదుదారు ఎవరైతే తమ నిర్ధిష్ట వాట్సాప్ ఖాతా నుంచి సంప్రదించాల్సి ఉంటుంది. దేశం కోడ్ యాడ్ చేసి (+91) అంతర్జాతీయ ఫార్మాట్ లో ఫోన్ నంబర్ చేర్చి ఫిర్యాదు చేయాలి.
వాట్సాప్ ను సురక్షితంగా మార్చేందుకు దాని మాతృసంస్థ ‘మెటా’ చర్యలు చేపడుతోంది. ప్రత్యేకమైన టూల్స్ తో ఈ పనిచేస్తోంది. రిపోర్ట్ ఫీచర్ ద్వారా యూజర్లు ఎవరి ఖాతాపైన అయినా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించింది. ఇప్పటికే 2021 డిసెంబర్ నెలలో వాట్సాప్ 20 లక్షలకు పైగా భారత్ కు చెందిన అకౌంట్లను బ్యాన్ చేసింది. ఇప్పుడు తాజాగా జనవరి లో మరో 18 లక్షల ఖాతాలను నిషేధించి సంచలనం సృష్టించింది.
Also Read: BJP Strategy To Attract Farmers: తెలంగాణలో రైతులను ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?
Recommended Video: