Kaziranga National Park: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో పర్యటిస్తున్నారు. అస్సాం లో కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఖడ్గం మృగాలు, అడవి దున్నలు, జింకలు, ఏనుగుల ఫోటోలను తన ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి పోస్ట్ చేశారు. ఏనుగు మీద ఎక్కి ఆ అభయారాణ్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏనుగులకు చెరుకు గడలు తినిపించారు. ” ఈరోజు నేను ఉదయం అస్సాం చేరుకున్నాను. ఇక్కడి అభయారణ్యాన్ని సందర్శించాను. ఈ ప్రాంతం ఎంతో బాగుంది. అరుదైన జంతువులు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రాంతం పర్యాటకులకు ఎంతో బాగుంటుందని” మోడీ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.. మోడీ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఏమిటి ఈ అభయారణ్యం
కజిరంగ నేషనల్ పార్క్ ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ అభయారణ్యం ఖడ్గం మృగాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏనుగులు, జంకలు, పులులు, అడవి దున్నలు, ఇతర జంతువులు విస్తారంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రంలో అద్భుతమైన జీవవైవిధ్యానికి నిదర్శనంగా ఈ పార్కు నిలుస్తోంది.. ఈ అభయారణ్యం అస్సాం రాష్ట్రంలోని గోలఘాట్, నాగోవాన్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యాన్ని 1904 లో ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి దీనిని నేషనల్ పార్క్ గా ప్రకటించారు. మనదేశంలో ఉన్న అతిపెద్ద అభయారణ్యాలలోకజిరంగ నేషనల్ పార్క్ కూడా ఒకటి. దేశంలో ఎక్కడా కనిపించని ఖడ్గ మృగాలు ఇక్కడ మాత్రమే దర్శనమిస్తుంటాయి. ఇందుకు ఈ అడవిలో ఉన్న వాతావరణమే కారణం. పులులు, ఏనుగులు, నక్కలు, కోతులు, అడవి దున్నలు, జింకలు, దుప్పులు వంటి జంతువులు ఇక్కడ విస్తారంగా తిరుగుతుంటాయి. వీటిని సందర్శించేందుకు అభయారణ్య సిబ్బంది పర్యాటకుల కోసం ఓపెన్ జీప్ సౌకర్యాన్ని కల్పిస్తుంటారు..
నాలుగు జోన్లుగా..
ఈ అభయారణ్యాన్ని కజిరంగ నేషనల్ పార్క్ సిబ్బంది నాలుగు జోన్లుగా విభజించారు. ఈ నాలుగు జోన్లలో టైగర్ రిజర్వ్ అత్యంత దట్టమైన అడవిలో ఉంటుంది.. 2006లో ఈ అడవిని టైగర్ రిజర్వుగా ప్రకటించారు. ఈ అడవిలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో పులుల సాంద్రత ఉన్నది. 430 చదర కిలోమీటర్ల విస్తీర్ణంలో కజిరంగ నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. 1985లో ఐక్యరాజ్యసమితి ఈ అడవిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.. కేవలం జంతువులు మాత్రమే కాకుండా అరుదైన పక్షులు కూడా ఈ కజిరంగ నేషనల్ పార్క్ లో కనిపిస్తాయి.
బ్రహ్మపుత్ర నది ప్రవాహంతో..
బ్రహ్మపుత్ర నది 365 రోజులు ఈ అడవి మీదుగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ అడవిలో వృక్ష సంపద విస్తారంగా ఉంటుంది. ఉష్ణ మండల తేమతో కూడిన మిశ్రమ ఆకురాల్చే అడవులు, ఉష్ణ మండల పాక్షిక సతత హరిత అడువులు, పొడవైన గడ్డి ఉన్న మైదానాలు, పొట్టి గడ్డి ఉన్న మైదానాల వల్ల ఈ అడవిలో విస్తారంగా జింకలు పెరుగుతుంటాయి. పర్యాటకుల కోసం ఓపెన్ జీప్ సవారి ఉంటుంది. ఎంచుకున్న ప్యాకేజీల ఆధారంగా ఏనుగు సవారి కూడా ఉంటుంది. ఇంతటి అత్యద్భుతమైన జంతుజాలం, విభిన్నమైన జీవవైవిధ్యం ఉంది కాబట్టే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కజిరంగ నేషనల్ పార్క్ ను చూసి మైమరిచిపోయారు.. అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేసి పర్యాటకుల్లో అమితాసక్తిని కలిగించారు. ఇక ఈ అభయారణ్యం నవంబర్ నుంచి ఏప్రిల్ ఒకటి వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. దీనిని మే ఒకటి నుంచి అక్టోబర్ 31 వరకు మూసివేస్తారు. ఆ సమయంలో జంతువులు ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. అలా సందర్శకులను అనుమతిస్తే అవి ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో ఆ విధానాన్ని అమలు చేస్తారు. ఈ పార్క్ టూర్ ప్యాకేజీ కోసం +91- 7982094829, సఫారీ బుకింగ్ కోసం +91-9873398995 లో సంప్రదించాలి.
আজি পুৱা মই অসমৰ কাজিৰঙা ৰাষ্ট্ৰীয় উদ্যানত আছিলো। প্ৰচুৰ সেউজীয়াৰে পৰিবেষ্টিত এই ইউনেস্কো বিশ্ব ঐতিহ্য ক্ষেত্ৰখন বিশ্বপ্ৰসিদ্ধ এশিঙীয়া গঁড়কে ধৰি বৈচিত্ৰময় উদ্ভিদ আৰু প্ৰাণীজগতেৰে ধন্য। pic.twitter.com/yspWhLnPtd
— Narendra Modi (@narendramodi) March 9, 2024