https://oktelugu.com/

Bikeriding with a cow: అరెయ్ ఏంట్రా ఇదీ.. ఆవును ఎక్కించుకొని బైక్ రైడ్.. అవాక్కయ్యే వీడియో వైరల్‌

ప్రమాదకరమైన ఫీట్స్‌తో ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చనిస్తున్నారు. కానీ ఆ యువకుడు రీల్స్‌ కోసమే చేశాడా లేక అవసరం కోసం అలా చేయడా అన్నది మాత్రం తెలియదు.

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2023 / 02:16 PM IST
    Follow us on

    Riding a bike with a cow : సోషల్‌ మీడియాతో ఎంతోమంది తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. కొంతమంది లైక్స్, షేర్స్‌ కోసం స్కిట్స్, రీల్‌ చేస్తూ వెలుగులోకి వస్తున్నారు. ఇలా ప్రతీరోజు ఎన్నో వింత, ఫన్నీ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిని చూసినవారు టాలెంట్‌ను అభినందిస్తున్నారు. ఫన్నీ వీడియోలు చూసి నవ్వుకుంటున్నారు. అలాటి ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

    ఆవుతో బైక్‌రైడింగ్‌..
    సాధారణంగా పెట్స్‌ను తమ వాహనాల్లో తీసుకెళ్లడం చూస్తుంటాం. పిల్లులు, కుక్కలు, పక్షులను తమ వెంట తీసుకెళ్తారు. ఇందుకోసం బైక్, కార్లు వాడతారు. గ్రామాల్లో అయితే దూడలు, మేకలు, గొర్రెలను తీసుకెళ్తుంటారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి డ్రైవింగ్‌ పరిమితులను దాటేసి ప్రవర్తించాడు.. మోటారుసైకిల్‌పై ఏకంగా ఒక ఆవును కూర్చోబెట్టుకుని ప్రయాణిస్తున్నాడు.. బైక్‌ ముందు భాగంలో ఆవును చిన్నపిల్లలా కూర్చుబెట్టుకుని, అతడు జాలిగా బైక్‌ రైడ్‌ చేస్తుండగా, ఆ ఆవు కూడా ఏం చక్కా ఎంజాయ్‌ చేస్తూ కనిపించింది. ఈ వీడియోలో అతని డ్రైవింగ్‌ స్కిల్‌ని పరిచయం చేస్తుంది. ఇంత చిన్న వాహనంపై అంత పెద్ద జంతువును ఎక్కించుకుని వెళ్తున్న అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

    చిన్నవైతే పర్లేదు..
    మేకలు, కుక్కలు లేదా పిల్లులు బైక్‌లపై ప్రయాణించడం చూసి ఉంటారు. ఇలాంటి పెంపుడు జంతువులు చిన్నగా ఉంటాయి. మనుషులు వాటిని సులువుగా ఎత్తుకుని ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు వీలుగా ఉంటుంది. కాబ్టటి ఇలాంటి చిన్ని చిన్న పెంపుడు జంతువులను జనాలు తమ వాహనాలపై వెంట తీసుకువెళ్తుంటారు. కానీ, ఇలా ఆవును బైక్‌పై ఎక్కించుకుని ట్రావెల్‌ చేయటమం అంటే నిజంగా విచిత్రమే. అతడు ఆవును బైక్‌పై తన ముందు అచ్చం తన చంటిబిడ్డను ఎలాగైతే కూర్చొబెట్టుకుని తీసుకువెళ్తాడో.. అలాగే.. ఆవును కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు. అయితే అతడు చేసిన ఈ వింత విన్యాసాన్ని కొందరు వాహనదారులు, ప్రయాణికులు వీడియో తీశారు. అనంతరం సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేయటంతో వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అతడు ట్రాఫిక్‌ నిబంధనలను తుంగలో తొక్కి అతి వేగంగా బైక్‌ నడుపుతున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ఆవు కూడా అతన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. అయితే ఆవు ఏమాత్రం ఎగిరినా, కాస్త అటు ఇటు కదిలి ఉంటే కూడా ప్రమాదం జరిగి ఉండేది.

    నెటిజన్ల కామెంట్‌..
    సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అయ్యారు. వినియోగదారులు తమ భిన్నమైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.. ఆ వ్యక్తి బైక్‌పై ఆవును ఎలా కూర్చోబెట్టి ఉంటాడని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది వినియోగదారులు దీన్ని లైక్‌ చేశారు. వందల మంది రకరకాల కామెంట్లతోపాటు విమర్శలు చేస్తున్నారు. ప్రమాదకరమైన ఫీట్స్‌తో ప్రాణాలకు ముప్పు తప్పదని హెచ్చనిస్తున్నారు. కానీ ఆ యువకుడు రీల్స్‌ కోసమే చేశాడా లేక అవసరం కోసం అలా చేయడా అన్నది మాత్రం తెలియదు.