https://oktelugu.com/

ISRO Chairman Somanath: ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి మూలం మన వేదాలు.. ఇస్రో చైర్మన్ సంచలన వ్యాఖ్యలు..

ఇప్పుడున్న ఇస్రో చైర్మన్ గతంలో ఓసారి మహర్షి పాణిని సంస్కృత, వేద విశ్వ విద్యాలయ స్నాతకోత్సవానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేదాలు, సంస్కృతాన్ని పొగిడారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 26, 2023 6:25 pm
    ISRO Chairman Somanath

    ISRO Chairman Somanath

    Follow us on

    ISRO Chairman Somanath: చంద్రయాన్ -3 సక్సెస్ తరువాత ఇస్రో శాస్త్రవేత్తల ఘనత ప్రపంచానికి తెలిసింది. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి మన శాస్త్రవేత్తలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు చీఫ్ డైరెక్టర్ సోమనాథ్ ను ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో సోమనాథ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. ‘సైన్స్ వేదాల నుంచి పుట్టింది’ అనే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అయితే సైన్స్ వేదానికి విరుద్ధం. అలాంటప్పుడు ఇస్రో చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు కాదు. అసలేం జరిగిందంటే?

    ఇప్పుడున్న ఇస్రో చైర్మన్ గతంలో ఓసారి మహర్షి పాణిని సంస్కృత, వేద విశ్వ విద్యాలయ స్నాతకోత్సవానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేదాలు, సంస్కృతాన్ని పొగిడారు. ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాషలలో సంస్కృతం ఒకటి అని అన్నారు. కవిత్వం, తత్వ శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గణితం మొదలైన రచనలు సంస్కృతంలో ఉండేవని అన్నారు. సంస్కృతంలో తాను చదివిని మొదటి పుస్తకం ‘సూర్య సిద్ధాంతం’ అని, సూర్యుని చుట్టూ గ్రహాలు ఎలా కదులుతాయి? వాటి సమయ ప్రమాణాలు గురించి చర్చిస్తుందని అన్నారు.

    అయితే ఇటీవల చంద్రయాన్ -3 సందర్భంగా సోమనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కానీ ఈ వ్యాఖ్యలు చేసింది 2023 మే 25. చంద్రయాన్ -3 కి సోమనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని కొందరు పేర్కొంటున్నారు. చంద్రయాన్ -3 ప్రాజెక్టు కోసం చాలా మంది కృషి ఉంది. అయితే సోమనాథ్ మాత్రం ‘చంద్రయాన్ -3 విజయం వెనుక రుగ్వేదం ఉందని అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు నిజం కాదని తెలుస్తోంది.

    ఇక చంద్రయాన్ -3 గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ను ఇస్రో వెల్లడిస్తోంది. తాజాగా రోవర్ లోని పేలోడ్స్ యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇవి పరిశోధనలు ప్రారంభించాయని, త్వరలో ఇవి చేసిన పరిశోధన వివరాలను వెల్లడిస్తుందని ఇస్రో తెలిపింది.మరోవైపు ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.