Chandrayaan 3: ఎట్టకేలకు భారత్ చంద్రయాన్ పై స్పందించిన పాకిస్తాన్.. నోరుమెదపని చైనా

భారత్, పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఏ విషయంలోనైనా భారత్ పై గెలవాలని పాక్ పరితపిస్తు ఉంటుంది. ఈ క్రమంలో భారత్ చేసే పనులపై ఏదో విమర్శ చేయడం తప్ప మెచ్చుకున్న దాఖలాలు లేవు.

Written By: Srinivas, Updated On : August 26, 2023 6:20 pm

Chandrayaan 3

Follow us on

Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ -3 విజయవంతంగా తన పనులు చేస్తోంది. ఆగస్టు 23న ఎలాంటి ఆటంకాలు లేకుండా చంద్రుడిపై ల్యాండర్ దిగడంతో అందులో ఉండే రోవర్ 4 గంటల తరువాత బయటకు వచ్చింది. ఆ తరువాత రోవర్ లోని పేలోడ్స్ అన్ని యాక్టివ్ అయ్యాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రతిరోజూ చంద్రుడిపై జరిగే ప్రక్రియను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నామని అన్నారు. ఈ పేలోడ్స్ సమాచారాన్ని సేకరించి త్వరలోనే పంపుతుందని తెలిపారు. ఈ తరుణంలో ఇస్రో కు ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇందులో భాగంగా భారత ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ మన శాస్త్రవేత్తలను మెచ్చుకున్నారు. కానీ చైనా మాత్రం స్పందించలేదు.

భారత్, పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఏ విషయంలోనైనా భారత్ పై గెలవాలని పాక్ పరితపిస్తు ఉంటుంది. ఈ క్రమంలో భారత్ చేసే పనులపై ఏదో విమర్శ చేయడం తప్ప మెచ్చుకున్న దాఖలాలు లేవు. కానీ ఇస్రో శాస్త్రవేత్తల ఘనతతో పాక్ ప్రభుత్వం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఈ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ ను మెచ్చుకున్నారు.

అంతుకుముందు విలేకలరు చంద్రయాన్ 3 పై ముంతాజ్ ను అడిగారు. దీంతో ‘చంద్రుని ధ్రువంపై ఇస్రో ల్యాండింగ్ మాడ్యూల్ ను సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం గొప్ప సైంటిఫిక్ విజయం. ఇస్త్రో శాస్త్రవేత్తలు ప్రశంసలకు అన్ని విధాలుగా అర్హులు’ అనిఅన్నారు. అయితే ఇంతకాలం భారత్ పై విమర్శలు మాత్రమే చేసినపాకిస్తాన్ ఇలా ప్రశంసించడంపై ఆసక్తి రేపుతోంది. భారత్ లోని ఇస్త్రో శాస్త్రవేత్తలు సాధించిన ఘనతతో శత్రు దేశం సైతం ప్రశంసలు కురిపించడం మాములు విషయం కాదని కొనియాడుతున్నారు.

ఇక పొరుగున ఉన్న మరో దేశం చైనా ఇప్పటి వరకు స్పందించలేదు.ఇటీవల బ్రిక్స్ సమావేశం జరిగినప్పుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఉన్నారు. కానీ ఆ దేశం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అయితే చైనా ఇప్పటికే చంద్రుడి ఉత్తర ధ్రువంపై దిగినదేశంగా నిలిచింది. దక్షిణ ధ్రువంపై భారత్ మాత్రమే అడుగుపెట్టడంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగాచర్చించుకుంటున్నాయి.