TVK Vijay Rally Stampede: తమిళనాడులో సంచలన రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు టివికె పార్టీ అధినేత విజయ్. పార్టీ పెట్టిన కొద్దిరోజుల్లోనే విజయ్ తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా సరే జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన నిర్వహిస్తున్న సభలకు భారీగా జనం వస్తున్నారు. మొత్తంగా చూస్తే అధికార డిఎంకెకు.. ప్రతిపక్ష అన్న డిఎంకె కు విజయ్ చుక్కలు చూపిస్తున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపికి పక్కలో బల్లెం మాదిరిగా మారారు. అటువంటి విజయ్ ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన నిర్వహించిన ర్యాలీలో ఘోరం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి ఏకంగా 31 మంది కన్నుమూశారు.
Full Speech of Thalaivar @TVKVijayHQ from #Karur #உங்கவிஜய்_நா_வரேன் #TVKVijay pic.twitter.com/XIjUfd6JUf
— Actor Vijay Fans Page (@ActorVijayFP) September 27, 2025
ఇటీవల కాలంలో విజయ్ తన టీవీకే పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమాలకు జనం విశేషంగా హాజరవుతున్నారు. శనివారం కరూర్ ప్రాంతంలో టీ వీ కే పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలికి విపరీతంగా జనాలు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. ఒకానొక సందర్భంలో ఈ మీటింగ్ కు 10,000 మంది వరకు వస్తారని అంచనా వేశారు. కానీ ఆ సంఖ్య ఏకంగా అంతకుమించి ఆనే స్థాయికి చేరుకుంది. విజయ్ ప్రసంగాన్ని వినేందుకు జనాలు పోటీ పడటంతో అక్కడ ఒకసారిగా తోపులాట జరిగింది. జనం భారీగా రావడంతో ఆ తోపులాట కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఫలితంగా చూస్తుండగానే ఒకరిని ఒకరు తోసుకోవడంతో చాలామంది కింద పడిపోయారు. ఫలితంగా ఊపిరి ఆడక పోవడంతో చనిపోయారు. ఇలా చనిపోయిన వారు దాదాపు 31 మంది దాకా ఉంటారని అధికారులు చెబుతున్నారు. కరూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కరూర్ మెడికల్ కాలేజీకి గాయపడిన వారిని.. మరణించిన వారిని తరలించారు. అంబులెన్సులు ఇంకా అక్కడికి చేరుకుంటూనే ఉన్నాయి. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని కరూరు మెడికల్ కాలేజీ డీన్ శాంతి మలార్ ప్రకటించారు.
ఇంకా అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదు. వందలాది అంబులెన్సులు గాయపడిన వారిని.. ఆసుపత్రికి తరలిస్తూనే ఉన్నాయి. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్య న్ స్పందించారు. ఇప్పటివరకు 30 కి పైగా మంది చనిపోయారని.. మరో 50 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. గాయపడిన వారికి చికిత్స అందించేందుకు తిరుచి నుంచి 24 మంది వైద్యులు.. సేలం ప్రాంతం నుంచి 20 మంది వైద్యులను కరూర్ ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. జరిగిన సంఘటన బాధాకరమని.. ఇలా జరగకుండా ఉండి ఉండాల్సిందని.. ఏది ఏమైనప్పటికీ గాయపడిన వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.. సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తిరుచ్చి మంత్రి మహేష్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. విజయ్ తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్ళిపోతుండగా ఈ ఘటన జరిగిందని తమిళనాడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరూర్ మెడికల్ కాలేజీలో ఓకే పడకపై ముగ్గురిని పడుకోబెట్టి చికిత్స అందిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.
Breaking News
Already 31 dead due to stampede in TVK rally of Vijay. #Karur #TVKVijaypic.twitter.com/65UDmkdTl1
— Che_Krishna❤️ (@CheKrishnaCk_) September 27, 2025