Sukumar: ఒక సినిమా సక్సెస్ లో దర్శకుడు కీలక పాత్ర వహిస్తాడు. కథ రాసుకున్నప్పటి నుంచి సినిమాను స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేంతవరకు 24 క్రాఫ్ట్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితో సినిమాకు తగ్గట్టుగా పనిని చేయించుకొని ఏకకాలంలో అన్నింటిని పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేసినవాళ్లు మాత్రమే చాలా మంచి దర్శకులుగా గొప్ప గుర్తింపును సంపాదించుకుంటారు… పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు సుకుమార్… ఒకప్పుడు లవ్ స్టోరీస్ తో ప్రేమలో ఉన్న కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం చేసిన ఈ లెక్కల మాస్టారు ప్రస్తుతం మాస్ జపం చేస్తున్నాడు. వరుసగా సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు…ఇక సుకుమార్ దర్శకుడిగానే కాకుండా ఒక మంచి గురువుగా వందకు వంద మార్కులు కొట్టేశాడు. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన టాలెంటెడ్ కుర్రాళ్లను దర్శకులుగా పరిచయం చేసే బాధ్యతను సుకుమార్ తీసుకున్నాడు. సూర్య ప్రతాప్ పల్నాటి అనే దర్శకుడు ‘కుమారి 21 F’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక హరి ప్రసాద్ జక్కా ‘ ప్లే బ్యాక్’ అనే సినిమా చేశాడు… బుచ్చిబాబు సానా ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. శ్రీకాంత్ ఓదెల ‘దసర’ సినిమాతో డైరెక్టర్ గా మారి మంచి విజయాన్ని సాధించాడు. వీళ్లంతా సుకుమార్ శిష్యులే కావడం విశేషం. ప్రతి ఒక్క దర్శకుడు సక్సెస్ లను సాధిస్తూ సుకుమార్ యొక్క పేరు నిలబెడుతున్నారు…దాంతో ఇప్పుడు మరో ఇద్దరు దర్శకులు సైతం సుకుమార్ కాంపౌండ్ నుంచి బయటికి వస్తున్నారు… వీర అనే కుర్రాన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్ నుంచి ఒక సినిమా రాబోతోంది.
వీర యాక్షన్ ను బేస్ చేసుకొని రాయలసీమ నేపథ్యంలో చెప్పిన కథ సుకుమార్ కి బాగా నచ్చిందట. కిరణ్ అబ్బవరం తో సినిమా చేయబోతున్నారు. తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను సైతం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు…ఇక హేమంత్ అనే మరో అసిస్టెంట్ డైరెక్టర్ ని పరిచయం చేసే బాధ్యతను సైతం సుకుమార్ తీసుకున్నాడు…
తను చెప్పిన ఒక డీసెంట్ లవ్ స్టోరీ సుకుమార్ కు విపరీతంగా నచ్చేసిందట. దాంతో అతన్ని దర్శకుడిగా పరిచయం చేయాలని చేస్తున్నాడు… చాలామంది దర్శకులు వాళ్ళ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లతో పని లేకుండా సినిమా అయిపోయిన తర్వాత వాళ్లను పక్కకు పెట్టేస్తారు. కానీ సుకుమార్ మాత్రం టాలెంట్ ఉన్న వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తూ దర్శకులుగా పరిచయం చేసే బాధ్యతను తను తీసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం…
ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ని ఇబ్బందులు పడతాడు అనే విషయం చాలా మందికి తెలియదు. కష్టాలను భరిస్తూ, కన్నీళ్లను దిగమిగుతూ ఏదో ఒక రోజు తనకు ఒక మంచి గుర్తింపు వస్తుందనే ఉద్దేశ్యంతోనే సినిమా ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక ఇండస్ట్రీ లో కొనసాగుతుంటారు. ఈ కష్టమంతా సుకుమార్ కి తెలుసు కాబట్టే అసిస్టెంట్ దర్శకులను ఎంకరేజ్ చేస్తుంటాడు…