Trinamool Congress MPW: భారత ప్రజాస్వామ్యానికి పార్లమెంటే ప్రధానం. చట్టాలు, శాసనాలు రూపొందేది ఇక్కడే. ఈ ప్లామెంటుకు సభ్యులను పంపేది మాత్రం ప్రజలే. తమ ప్రతినిధిగా పార్లమెంటులో తమ సమస్యలను లేవనెత్తాలని.. పరిష్కారం చూపాలని కోరుకుంటారు. అయితే ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రతినిధులకు ఎప్పుడో ఒకసారి మాట్లాడే అవకాశం వస్తుంది. అవకాశం తెచ్చుకోవాలి కూడా. అవకాశం రానివారు సంబంధిత మంత్రులకు లేఖ రాస్తారు. అయితే మాట్లాడే అవకాశం వచ్చిన వారు మాత్రం దానిని సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్‌కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా అదే చేస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని కచ్చితంగా వినియోగించుకుంటున్నారు. సభ దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు. తాజాగా లోక్‌సభలో ఆమె చేసిన ప్రసంగం.. ప్రతిపక్ష నేతగా ప్రధాని మోదీని ప్రశ్నించిన విధానంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, ఆమె రాజకీయ జీవితం వివాదాలతో కూడా కప్పబడి ఉంది.
Also Read: నల్గొండ జిల్లాలో లిల్లీపుట్ నాయకుడు ఎవరు.. కవిత ఆ స్థాయిలో విమర్శలు చేయడానికి కారణమేంటి?
బ్యాంకర్ నుంచి రాజకీయవేత్తగా..
మహువా మొయిత్రా 1974 అక్టోబర్ 12న అసోం, కచార్ జిల్లాలోని లాబాక్‌లో జన్మించారు. కోల్‌కతాలో ఎకనమిక్స్, యుఎస్‌లోని మాసెచూసెట్స్‌లో మ్యాథమెటిక్స్‌లో డిగ్రీలు పొందారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా న్యూయార్క్, లండన్‌లో పనిచేశారు. 2009లో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు, మొదట కాంగ్రెస్ పార్టీలో, తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
కీలక పదవులు..
మహువా మొయిత్రా 2016–2019 మధ్య పశ్చిమ బెంగాల్ శాసనసభలో కరీంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సేవలందించారు. 2019లో కృష్ణానగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు, బీజేపీ అభ్యర్థిపై 63,218 ఓట్ల మెజారిటీ సాధించారు. 2024లో మళ్లీ అదే స్థానం నుంచి విజయం సాధించారు. టీఎంసీ జనరల్ సెక్రటరీ, జాతీయ ప్రతినిధిగా, 2023లో కృష్ణానగర్ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.
Also Read: ఆ ఒక్క మాటతో సంఘ్ పరివార్ ను షేక్ చేసిన రేవంత్ రెడ్డి
ఆకట్టుకునే ప్రసంగాలు..
మహువా తన తొలి లోక్‌సభ ప్రసంగంలో (2019) ఎన్డీయే ప్రభుత్వం నియంతృత్వ పోకడలను విమర్శిస్తూ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు. అదానీ గ్రూప్ వంటి పారిశ్రామిక సమూహాలపై, ఆర్థిక విధానాలపై ఆమె పదునైన ప్రశ్నలు పార్లమెంటును దడదడలాడించాయి. ఆమె వాక్చాతుర్యం, ధైర్యం ఆమెను విపక్ష నాయకురాలిగా నిలబెట్టాయి. తాజాగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సందర్భంగా లోక్‌సభను మహువా గడగడలాడించారు. తన వాక్‌చాతుర్యంతో మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. మహువా మాట్లాడుతున్నతసేపు సభ మొత్తం సైలెంట్‌గా ఉంది. అందరి దృష్టి మహువా ప్రసంగంపైనే ఉంది. పిండ్రాప్ సైలెన్స్‌గా సభ్యులంతా మహువా ప్రసంగం వినడం ఆమె ఆకట్టుకేనే వాక్‌చాతుర్యానికి నిదర్శనం.
మహువా మొయిత్రా రాజకీయ జీవితం ఆమె ధైర్యసాహసాలకు, సూటిగా మాట్లాడే తీరుకు నిదర్శనం. ఆమె పార్లమెంటులో ప్రశ్నించే విధానం, ప్రభుత్వ విధానాలను విమర్శించే ధైర్యం ఆమెను విపక్ష నాయకురాలిగా నిలబెట్టాయి.