Nykaas Falguni Nayar: భారతదేశంలో నైకా ఉత్పత్తుల గురించి మహిళలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవారి అందాన్ని పెంచే ఈ ఉత్పత్తులపై స్త్రీలు అమితాసక్తి చూపుతారు. ఈ నైకా సంస్థ వ్యవస్థాపకురాలైన ఫాల్గుణి నాయర్ ఇప్పుుడు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో చోటు సంపాదించారు. అంతేకాకుండా ఇండియాలో 10వ మహిళా బిలియనీర్ గా స్థానం దక్కించుకున్నారు. నైకా సంస్థ బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తుంది. ఈ ఉత్పత్తులు మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. స్థానిక దుకాణాలతో పోలిస్తే ఈ బ్రాండ్ వస్తువులు ఆన్లైన్లోనే ఎక్కువగా ఆపర్స్ ప్రకటిస్తారు. అందుకే ఈ సంస్థను ఎక్కువగా ఆదరించారు. అయితే ఈ సంస్థ వ్యవస్థాపకురాలైన పాల్గుణి నాయర్ ఎవరు..? ఆమె సక్సెస్ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో స్వయం కృషితో ఎదిగిన మహిళల్లో పాల్గుణి నాయర్ ఒకరు. 7.6 బిలియన్ డాలర్లు అంటే సుమారు 57వేల కోట్ల రూపాయలతో ఆమె ఈ స్థానం దక్కించుకున్నారు. ప్రపంచంలోని 10 మంది ధనవంతుల మహిళల్లో పాల్గుణి ఈఘనత సాధించారు. ఇప్పటిదాకా 10వ ర్యాంకులో ఉన్న బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా స్థానాన్ని పాల్గుని ఆక్రమించారు. ప్రపంచంలో స్వయం కృషితో ఎదిగిన వాళ్లు 124 మంది ఉన్నారు. వీరంతా 16 దేశాలకు చెందిన వారు. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా నుంచి ఒక్కరు కూడా లేదు. ఈ జాబితాలో ఎక్కువగా చైనా నుంచే ఉన్నారు. ఐదేళ్ల కిందటితో పోలిస్తే మహిళా ధనవంతుల సంఖ్య పెరిగింది. చైనాకు చెందిన పు యుజాన్ 17 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో నిలిచారు.
Also Read: TDP Formation Day: ఇక్కడ ఆవిర్భావ వేడుకలు..పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ లు
భారత్లో 10వ మహిళా బిలియనీర్ గా ఉన్న పాల్గుణితో పాటు రాధా వెంబు 3.9 బిలియన్ డాలర్లతో వరుసలో ఉన్నారు. ఆమె సోదరుడితో కలిసి ‘జోహో’ను ఏర్పాటు చేశారు. అత్యధిక సంపదను పెంచుకున్నవారిలో వెంబు రెండో స్థానంలో ఉన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీ కాన్ ఫ్లూయెంట్ వ్యవస్థాపకులరాలు నేహా నర్ఖేడే కూడా భారత సంతతికి చెందిన వారే. ఈమె అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 1.6 మిలియన్ డాలర్లతో కొత్త మహిళా బిలియనీర్లలో చోటు సంపాదించారు. ప్రపంచం మొత్తంలో 556 మంది బిలియనీర్లు ఉండగా .. అందులో సొంతంగా ఎదిగిన వారు 124 మంది చోటు సంపాదించారు.
ఇక పాల్గుణి నాయర్ నిర్వహిస్తున్న నైకా భారతదేశపు మొట్టమొదటి యూనికార్న్ స్టార్టప్. ఒక మహిళా నేతృత్వంలో 2012లో పాల్గుణి నాయర్ స్థాపించిన నైకా మొబైల్, వెబ్ సైట్ ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. నైకా ప్రజాదరణ పెరిగే కొద్దీ కత్రినా కైఫ్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులు, ఇతర సోషల్ మీడియా ప్రభావశీలులు, కొందరు ఈ సంస్తకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. 2015 నుంచి ఈ సంస్థ సొంతంగా తయారు చేసిన వస్త్రాలు, గృహోపకరణాలను కూడా అమ్మడం మొదలు పెట్టింది. అంచెలంచెలుగా ఎదిగిన ఈ బ్రాండ్ పేరిట ఇప్పుడు 84 స్టోర్లు వెలిశాయి.
Also Read: Balakrishna- Gopichand Malineni Movie Update: బాలయ్య ఫ్యాన్స్ కి ఉగాది రోజు బిగ్ సర్ ప్రైజ్
[…] Shankaranna Commits Self Destruction: అర్థం చేసుకునే మనసు లేనప్పుడు ఆకర్షించే అందమెందుకు? బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే గొప్పది. అర్థం చేసుకునే ఆలి లేకపోతే బతుకంతా వ్యర్థమే. అందుకే అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు. ఇల్లు కడితే అప్పులే. పెళ్లి చేసుకుంటే తిప్పలే మిగులుతాయి. ఆయనో పెద్ద మనిషి. వివాహ వయసు దాటిపోవడంతో ఇక పెళ్లెందుకని ఉన్నదాంట్లోనే తృప్తిగా జీవించాలని అనుకున్నాడు. కానీ తానోటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా ఆయన తలరాతే మారిపోయింది. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలనుకున్నా అతడి జీవితం మాత్రం బొంగరంలా తిరిగిపోయింది. అర్థం చేసుకోలేని అర్థాంగి ఉంటే కోట్లు ఉన్నా నరకమే అని నిరూపించింది. […]