AP New Disticts: మార్పు ఎప్పుడూ మంచిదే. ఎప్పుడు చేసినా సంస్కరణలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ప్రజలకు పాలన చేరువ చేస్తాయి. అప్పుడు ఎప్పుడో తెలంగాణలో భూస్వాములు, దొరలకు మేలు చేసేలా ఉన్న ‘పటేల్ పట్వారీ’ వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ మండలాలను ఏర్పాటు చేసి ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి విభజనలు లేనే లేవు. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే బాటలో జగన్ నడిచారు.

ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన అతిపెద్ద హామీని నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో లాగానే ఏపీలోనూ కొత్త జిల్లాల ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం కూడా ఖరారైంది. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
-కొత్త జిల్లాలు ఇవే
26 జిల్లాల ఏర్పాటుకు జగన్ ఆమోదం తెలిపారు. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సారావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాలు అమల్లోకి రానున్నాయి.
-కొత్త రెవెన్యూ డివిజన్లు ఇవే
శ్రీకాళహస్తి, , కుప్పం, పలమనేరు, రాయచోటి, పుట్టపర్తి, ధర్మవరం, గుంతకల్, డోన్, ఆత్మకూరు, సత్తెనపల్లి, చీరాల, బాపట్ల, నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, భీమవరం, కొత్తపేట, బీమిలి, చీపురుపల్లి, బొబ్బిలి, పలాస.
Also Read: Anasuya Bharadwaj: వైరల్ : రకరకాలుగా అందాలను వెదజల్లుతున్న అనసూయ
నిజానికి ఉగాది నాడే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని అనుకున్నారు.కానీ ఆ తర్వాత రెండురోజులకు ఈ కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఇక వాటితోపాటు పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. ఏప్రిల్ 6న వలంటీర్ల సేవలకు సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేవారు. ఏప్రిల్ 8వ తేదీన ‘వసతి దీవెన’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
కొత్త జిల్లాలపై ఇప్పటికే ప్రభుత్వం అభ్యంతరాలను ఆహ్వానించింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, సూచనలు, సలహాలు , ఫిర్యాదులు అందించారు. పలు జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా చర్చించారు. ఈ క్రమంలోనే జగన్ కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను సీఎస్ సహా ఉన్నతాధికారులు తాజాగా సీఎం జగన్ కు అందించారు.
ఏపీలో కొత్త జిల్లాలపై 16600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయి. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాల ఏర్పాటులో మార్పులు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అందరితో చర్చించి, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లా కలెక్టర్లు సిఫార్సు చేసినట్లు తెలిపారు.
ఇక కొత్త జిల్లాలకు కలెక్టరేట్ల ఎంపిక కోసం స్థలం ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని, కనీసం 15 ఎకరాల స్థలం ఉండేలా చూసుకోవాలని సీఎం జగన్ దిశానిర్ధేశం చేశారు. జిల్లా కలెక్టరేట్ సహా అన్ని కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా కొత్త కలెక్టర్లరేట్లు ఉండాలని సూచించారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో ప్రారంభించి అనంతరం కొత్త భవనాలకు మార్చాలని తెలిపారు.
Also Read: Uniform Secretariat Employees: జగన్ చెప్పినదేమిటి? చేస్తున్నదేమిటి? సచివాలయ ఉద్యోగులకు తీరని వ్యథ
[…] Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్య తరచూ వార్తల్లనే నిలుస్తోంది. ఈ అసోసియేషన్‌కు అన్ని రకాల హంగులు ఉన్నా కూడా.. అధోగతిలాగే ఉంది. ఈ అసోసియేషన్ లో పెద్దల మధ్య చాలా కాలంగా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచులే పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ క్రికెట్ భవిష్యత్ పూర్తి అగమ్య గోచరంగా మారిపోయింది. […]
[…] Buddha Venkanna Fires On Kodali Nani: ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. అధికార వైసీపీ మంత్రుల మాటల అయితే ముత్యాలలాగే ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ఎలాంటి కామెంట్ చేస్తారో మనం గతంలో చాలా చూశాం. అయితే మొన్న టీడీపీ ఏర్పడి 40 వసంతాలు గడిచిన సందర్భంగా చంద్రబాబు కొన్ని ఎమోషనల్ కామెంట్లు చేశారు. వీటిని కూడా కొడాలి నాని వక్రీకరించి మాట్లాడారు. […]
[…] Prashant Kishor- Chandrababu Naidu: గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వలే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని శపథం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అమిత్ షా సామర్థ్యానికి పీకే వ్యూహాలకు పరీక్షగా నిలుస్తోంది. అమిత్ షా కూడా పలుమార్లు పీకే వ్యూహాలపై పెదవి విరిచారు. పీకే కూడా అధికారంలో ఉన్నప్పుడు కాదు అధికారంలో లేనప్పుడు సత్తా చూపించాలి అని చాలెంజ్ చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. దీంతో ఇద్దరి శక్తులకు ప్రతీకగా గుజరాత్ ఎన్నికలు నిలిచే అవకాశముంది. […]
[…] Minister Kodali Nani- Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణకు జగన్ కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే మంత్రివర్గంలో ఎవరిని ఉంచాలి? ఎవరికి పదవులు ఇవ్వాలి? ఎవరితో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై క్లారిటీకి వచ్చినట్లు ఉంది. దీంతో కొడాలి నానిని సైతం మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీ పదవి కట్టబెడతారనే తెలుస్తోంది. ఇన్నాళ్లు మంత్రిగా ఉండటంతోనే కాస్త కుదురుగా ఉన్నానని ఇక ఫ్రీ అయిపోయాక చంద్రబాబు పని చెబుతానని నాని గట్టిగా చెబుతున్నారు. దీంతో చంద్రబాబుపై ప్రయోగించే అస్త్రంగా నాని మారతాడనే వాదనలు వస్తున్నాయి. […]