Richest Temples: ప్రపంచంలో అత్యధికంగా దేవాలయాలు భారత్ లోనే ఉన్నాయి. భక్తులు తమ కోరికలను తీర్చుకోవడానికి ప్రతిరోజూ ఏదో ఒక దేవాలయానికి వస్తుంటారు. మరికొందరు ప్రశాంత వాతావరణం పొందేందుకు దేవాలయాలను సందర్శిస్తుంటారు. ఈ క్రమంలో దేశంలో అనేక ప్రాంతాల్లో వివిధ దేవుళ్లకు ఆలయాలు నిర్మిస్తూ వచ్చారు. దేశంలో వేల కొద్ది ఆలయాలు ఉన్నా.. కొన్నింటికి మాత్రం ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా వీటికి ఆదాయం కూడా బాగానే వస్తోంది. పురాతన కాలంలోనే ఈ ఆలయాలకు కొందరు రాజులు ప్రత్యేకంగా ధనాన్ని కేటాయించారు. అవి అంతంకంతకు పెరుగుతూ వచ్చి ఇప్పుడు వాటి విలువ కోట్లకు పెరిగింది. మరి దేశంలో అత్యధికంగా ధనం కలిగిన ఆలయాలు ఏవో చూద్దాం..
దేశంలో దక్షిణాన ఉన్న కేరళలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. ఈ రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పద్మనాభస్వామి ఆలయం కాగా..మరొకటి అయ్యప్పస్వామి ఆలయం. వీటిలో పద్మనాభస్వామి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పుుకోవచ్చు. కేరళ రాజధాని త్రివేండ్రంలో ఉన్న ఈ ఆలయం అత్యధికంగా ఆదాయం కలిగి ఉంది. ఇటీవల తేల్చిన లెక్కల ప్రకారం ఈ ఆలయంలో రూ.1,20.000 కోట్ల సంపద కలిగి ఉందని తేల్చారు.
పద్మనాభస్వామి ఆలయం తరువాత రెండోస్థానంలో ఉన్న ఆలయం మన తిరుపతి వెంకన్న స్వామి ఆలయమే. ప్రపంచంలోనే ప్రాముఖ్యత కలిగిన తిరుమల శ్రీవారిని నిత్యం లక్షలాది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. వీరు తమ కోరికలను నెరవేర్చాలను వివిధ రూపాల్లో కానుకలు వేస్తుంటారు. ప్రస్తుతం తిరుపతి ఆలయం రూ.14,000 కోట్ల సంపద కలిగి ఉన్నట్లు తేల్చారు.
మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయం షిర్డీ. బాబా భక్తులంతా ఒక్కసారైనా షిర్డీ వెళ్లి రావాలని కోరుకుంటారు. దీంతో ఈ ఆలయంలోనూ నిత్యం భక్తులు కనిపిస్తూ ఉంటారు. ఈ ఆలయ సంపద రూ.1800 కోట్ల వరకూ ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులతో ఈ ఆలయ పరిసరాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
భారత్ కు ఉత్తరాన ఉన్న కాశ్మీర్ లోని వైష్ణోదేవీ ఆలయం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఈ ఆలయాన్ని చూసేందుకు భక్తులు నిత్యం వస్తుంటారు. వైష్ణోదేవీ ఆలయ సంపద 500 కోట్ల వరకూ ఉంది. మహారాష్ట్రలోని ముంబై నగరంలో సిద్ధివినాయక ఆలయం అత్యంత ప్రాముఖ్యత కలిగింది. ఈ ఆలయం సంపద రూ.125 కోట్ల వరకూ ఉంది.
దేశంలో టాప్ 1లో కేరళ ఆనంత పద్మనాభస్వామి ఆలయం ఉండగా.. రెండో స్థానంలో మన తిరుపతి ఉండడం విశేషం.. అత్యంత తక్కువ సంపద కలిగింది సిద్ధివినాయక ఆలయంగా ఉంది.