Steel Prices: ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. ఎందుకంటే ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఖర్చులే తప్ప రాబడి ఉండదు. దీంతో ఈ సామెత వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం పెరుగుతున్న ధరలతో సామాన్యుడు కుదేలవుతున్నాడు. ఇల్లు కట్టాలంటే గగనమే అవుతోంది. చేతి చమురు మొత్తం వదలాల్సిందే. లేకపోతే కష్టమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇల్లు కట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు. ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. కానీ ఇప్పుడు స్టీలు ధరలు మాత్రం తగ్గడం ఉపశమనం కలిగించేదే.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఏప్రిల్ నుంచి ఉక్కు ఉత్పత్తి క్షీణించడం తెలిసిందే. దీంతో ఉత్పత్తి జరగడం లేదు. కానీ ధరలు మాత్రం దిగొస్తున్నాయి. కోల్ కతాలో స్టీలు టన్నుకు రూ. 10-15 శాతం తగ్గింది. బొగ్గు కొరత కారణంగా పెరిగిన రేట్లు కంపెనీలకు ఇబ్బందిగా మారాయి. నిర్మాణ రంగంపై ఉక్కు, సిమెంట్ ధరలు భారాన్ని మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో టన్ను ఉక్కు ధర రూ. 75 వేలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read: AP Unemployment: ఉద్యోగాలెక్కడ జగనన్న.. ఏపీ సర్కారుపై నిరుద్యోగ యువత ఆగ్రహం
రానున్న కాలంలో స్టీల్ రేట్లు మరింత తగ్గనున్నట్లు తెలుస్తోంది. ఇన్ పుట్ ఖర్చులు 50 శాతం పెరగడంతో అధిక ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. యుద్ధం కారణంగా బొ్గు 300 డాలర్లకు చేరుకుంది. భవిష్యత్ లో ఉక్కు ధర టన్నుకు రూ.60 వేల వరకు తగ్గనుందని తెలుస్తోంది. నూతనంగా గృహం నిర్మించుకోవాలనే వారికి ధరల తగ్గుదల ఆసక్తి కరంగా కనిపించినా మిగతా వాటి ధరలు మాత్రం తగ్గడం లేదు. ఇసుక, సిమెంట్ ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
2023 నాటికి ఉక్కు ధరలు రూ. 60 వేల వరకు తగ్గుతాయని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బొగ్గు ధరలు తగ్గకపోతే 30-40 శాతం తగ్గుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పరిశ్రమలను మూసి వేయాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. బెంగాల్ లో సుమారు లక్ష మందికి ఈ పరిశ్రమ ఉపాధి కల్పిస్తోందని తెలుస్తోంది. మొత్తానికి ఇల్లు కట్టుకునే వారికి స్టీల్ ధరలు తగ్గింపు ఉపశమనం కలిగించేదే అని పలువురు చెబుతున్నారు.
Also Read:Rupee Value: డాలర్ తో రూపాయి విలువ పడిపోతే లాభమా? నష్టమా? తెలుగు వారికి ఏం ప్రయోజనం?
Recommended Videos