PM Modi: తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. మొన్నటి వరకు తెలంగాణలో బీఆర్‌ఎస్(టీఆర్‌ఎస్) అధికారంలో ఉంది. ఇక ఏపీలో ఇప్పటికీ ప్రాంతీయ పార్టీ వైసీపీ అధికారంలో ఉంది. అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉంది. అయితే ప్రాంతీయ పార్టీలు ఒక పార్టీ చేసిన అభివృద్ధిని మరో పార్టీ నేతలు అంగీకరించడం లేదు. మాకంటే ఎవరూ ఎక్కువ చేయలేదని చెప్పుకుంటుంటారు. ప్రజలు కూడా వాటినే నమ్మి వీరు కాకపోతే వారు అన్నట్లుగా ఓట్లు వేసి ప్రాంతీయ పార్టీలకు పట్టం కడుతున్నారు. అయితే పదేళ్ల తర్వాత తెలంగాణలో జాతీయ పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరో రెండు నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి కూడా ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వచ్చే అవకావం ఉంది. అయితే పరిస్థితి చూస్తుంటే ప్రజలు నిజంగా అభివృద్ధిని కోరుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇది కదా అభివృద్ధి..
పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ నిజమైన అభివృద్ధి అదే. పదేళ్ల క్రితం దేశ బడ్జెట్ రూ.14 కోట్లు ఉంటే.. ఇప్పుడది రూ.44 లక్షల కోట్లకు చేరింది. తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. అత్యంత కీలకమైన మౌలిక రంగాలను చూసుకుంటే.. యూపీఏ హయాంలో రూ.1.57 వేల కోట్లు కేటాయిస్తే.. గడిచిన పదేళ్లలో రూ.44.30 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. పదేళ్ల క్రితం దేశ ఆదాయం రూ.13 లక్షల కోట్లు ఉంటే.. ఇప్పుడది రూ.270 లక్షల కోట్లకు పెరిగింది. విదేశీమారక నిల్వలు చూసుకుంటే పదేళ్ల క్రితం 225 బిలియన్ డాలర్లు ఉండగా, ఇప్పుడు 500 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇక జీడీపీ ర్యాంకు అప్పుడు 10 ఉండగా ఇప్పుడు 5కు చేరింది. బ్యాంకుల బకాయిలు అప్పట్లో 11 శాతం ఉండగా, ఇప్పుడు 1 శాతానికి తగ్గాయి. ఇంతకు మించిన అభివృద్ధి ఎవరికీ సాధ్యం కాదు.
వాస్తవాలు గ్రహించలేక..
ఇంత అభివృద్ధి జరుగుతున్నా.. ప్రజలకు చేరడం లేదు. వాస్తవాలను గ్రహించడం లేదు. దీంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రాంతీయ పార్టీల కోసమే కొట్టుకుంటున్నారు. కానీ, ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.