PM Modi : ఈ తొమ్మిదేళ్లలో మోడీ సాధించిన పెద్ద ప్రగతి అదే!

ఏకీకృత సైనిక కమాండ్ ఏర్పాటు, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ సేవల మధ్య ఉమ్మడి, ఏకీకరణను ప్రోత్సహించడం వంటి వాటిలో మోదీ సర్కారు ముందుంది. భారత రక్షణ రంగాన్ని ప్రపంచంలో ఒక శక్తిగా  తీర్చిదిద్దేందుకు ఒక మోదీ సర్కారు శక్తివంచన లేకుండా కృషిచేస్తోంది. 

Written By: Dharma, Updated On : May 29, 2023 5:15 pm
Follow us on

PM Modi : నరేంద్ర మోదీ.. ప్రపంచంలోనే ఈ పేరు మార్మోగిపోతోంది. అగ్రదేశాలు సైతం అచ్చెరువొందేలా భారత్ ను అగ్రపీఠాన ఉంచేందుకు మోదీ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. ఆయన ఇంట గెలిచి రచ్చ గెలిచారు. దేశ అంతర్గత రాజకీయాలను తట్టుకున్నారు. దేశం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌పై నిషేధం, పెద్దనోట్ల రద్దు, కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనడం వంటివి అందులో ప్రధానమైనవి.  అదే సమయంలో దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు నిరంతరం జరుగుతున్న ప్రత్యేక కృషి అభినందనీయమైనది. గత తొమ్మిదేళ్ల మోదీ హయాంలో రక్షణ రంగం కొత్తపుంతలను తొక్కుకుంటూ వస్తోంది.

రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరుగుతూవస్తున్నాయి. ప్రధానంగా రక్షణ రంగంలో ఆధునీకరణ, పరిశోధన, అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తూ వస్తున్నారు. ఆధునిక ఆయుధాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై దృష్టి సారిస్తోంది. ఇందుకోసం దేశీయ రక్షణ ఉత్పత్తికి కూడా పెద్దపీట వేస్తున్నారు. దిగుమతులు కాకుండా.. దేశీయ రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెస్ (డీపీపీ), మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించారు.  మేక్ ఇన్ ఇండియా, వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా వంటి కార్యక్రమాలు ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా డిఫెన్స్ తయారీలో ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించడంతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సాయుధ బలగాల ఆధునీకరణపై మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందుకోసం.. ఫైటర్ జెట్‌లు, జలాంతర్గాములు, ఫిరంగి వ్యవస్థలు, హెలికాప్టర్లు, క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుతో సహా అనేక ప్రధాన రక్షణ ఒప్పందాలు జరిగాయి. అటు రక్షణ దౌత్యంపై చాలా దృష్టి సారించింది. ద్వైపాక్షిక, బహుపాక్షిక సైనిక విన్యాసాలు, రక్షణ సంభాషణలు, సాంకేతికత బదిలీ.. భారతదేశంతో అనేక దేశాలతో రక్షణ సంబంధాలను బలోపేతం చేశాయి.

అటు దేశ సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతులు పెరిగాయి. చైనా, పాకిస్తాన్ బోర్డర్ లో రోడ్లు, వంతెనలు, సొరంగాలు వంటి వాటి నిర్మాణం చేపడుతున్నారు.  ముందస్తు నిఘా వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు. ఏకీకృత సైనిక కమాండ్ ఏర్పాటు, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ సేవల మధ్య ఉమ్మడి, ఏకీకరణను ప్రోత్సహించడం వంటి వాటిలో మోదీ సర్కారు ముందుంది. భారత రక్షణ రంగాన్ని ప్రపంచంలో ఒక శక్తిగా  తీర్చిదిద్దేందుకు ఒక మోదీ సర్కారు శక్తివంచన లేకుండా కృషిచేస్తోంది.