స్టార్ డమ్ కోసం ఎక్స్ పోజింగ్ ఏమిటి.. ఏమైనా చేస్తాను !

హస్కీ గర్ల్ ‘నివేదా థామస్’కి ఇంకా ఒక కోరిక చాల బలంగా ఉండిపోయిందట. తానూ కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని తెగఆశ పడుతుంది బ్యూటీ. కానీ, స్టార్ డమ్ ను పక్కన పెడితే.. సరైన అవకాశాలే రావడం లేదట. ఎప్పుడూ హస్కీ లుక్ లో కైపు ఎక్కించే చూపులతో కుర్రకారును బాగానే ఆకట్టుకుంటున్నా.. ఎందుకో నివేదా థామస్ కి మొదటి నుండి పెద్దగా పెద్ద అవకాశాలు రాలేదు. అందుకే, తనకు అర్జెంట్ గా స్టార్ హీరోల సినిమాల్లో […]

Written By: admin, Updated On : December 15, 2020 2:26 pm
Follow us on


హస్కీ గర్ల్ ‘నివేదా థామస్’కి ఇంకా ఒక కోరిక చాల బలంగా ఉండిపోయిందట. తానూ కూడా స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలని తెగఆశ పడుతుంది బ్యూటీ. కానీ, స్టార్ డమ్ ను పక్కన పెడితే.. సరైన అవకాశాలే రావడం లేదట. ఎప్పుడూ హస్కీ లుక్ లో కైపు ఎక్కించే చూపులతో కుర్రకారును బాగానే ఆకట్టుకుంటున్నా.. ఎందుకో నివేదా థామస్ కి మొదటి నుండి పెద్దగా పెద్ద అవకాశాలు రాలేదు. అందుకే, తనకు అర్జెంట్ గా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ లు కావాలట. తనకు టాలెంట్ ఉంది, పైగా గ్లామర్ కూడా ఉంది కదా, అన్నిటికీ మించి తానూ ఎక్స్ ప్రెషన్స్ తోనే అన్ని ఎమోషన్స్ ను పలికించగలను. మరి ఎందుకు నాకు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వరు.

Also Read: త్రివిక్రమ్‍ తో మహేష్ కి ఇక కష్టమే.. కారణం అదేనా ?

నేను ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేయను అనే ప్రచారం ఉంది. లేదు, అది అబద్దం.. పాత్ర డిమాండ్ చేస్తే.. నేను ఏమైనా చేస్తాను. యూత్ ను ఆకట్టుకోవడానికి ఎక్స్ పోజింగ్ చేయడానికి కూడా నాకు ఎలాంటి మొహమాటం లేదు అంటూ ఇండస్ట్రీలో బడా మేనేజర్లుగా ఉన్న కొంతమందికి, తన మేనేజర్ చేత మెసేజ్ లు పాస్ చేపిస్తోందట నివేదా. మొత్తానికి ఈ యంగ్ హీరోయిన్ తనను తానూ మార్కెట్ చేసుకోవడానికి కొత్త దారిని వెతుకున్నట్లు ఉంది. ఏది ఏమైనా ఈ యంగ్ బ్యూటీ పెద్ద హీరోల సరసన ఛాన్స్ ల కోసం తెగ ఆరాటపడుతుంది, తెగ తపన పడుతుంది.

Also Read: హిట్ లేకపోయినా బిజినెస్ బాగుంది !

నిజానికి గత రెండేళ్లుగా తెలుగులో నివేదా థామస్ కు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. అందుకే తమిళంలో వచ్చిన ఓ సినిమా కోసం మొదటిసారి అందాలు ఆర‌బోయ‌డంలో హద్దులు దాటింది. సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తన అందాలను ఆరబోస్తూ ఎలాంటి పాత్రలకైనా తాను రెడీ అన్న సంకేతాన్ని కూడా మేకర్స్ కి ఇవ్వడానికి బాగానే ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా నివేదా థామస్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి బాగానే కష్టపడుతుంది అన్నమాట. అయితే స్టార్ హీరో ఎన్టీఆర్ తో ‘జై లవకుశ’ సినిమాలో కూడా నటించి సౌత్ లో బాగానే గుర్తింపు తెచ్చుకున్నా.. నివేదా థామస్ కు మాత్రం, ఆ తరువాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్