Supreme Court: ఈ కాలంలో యువతీ యువకులు అడ్వాన్స్ గా ఉన్నారు. తమకు నచ్చినట్టుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ప్రేమ, పెళ్లి.. ఇలా ఏ బంధం లోనూ స్థిర స్థాయిగా ఉండాలని కోరుకోవడం లేదు. ఇష్టానుసారంగా ఉండాలని.. పరిమితమైన స్వేచ్ఛను అనుభవించాలని కోరుకుంటున్నారు. అందువల్లే ప్రేమలు మధ్యలోనే వాడిపోతున్నాయి. పెళ్లిళ్లు అంతలోనే పెటాకులు అవుతున్నాయి. ముఖ్యంగా హై ప్రొఫైల్ సర్కిల్స్లో జరుగుతున్న పెళ్లిళ్లు విడాకులకు దారితీస్తున్నాయి. ఇందులో కొన్ని కేసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళుతున్నాయి. ఈ కేసు కూడా అలాంటిదే.
సుప్రీంకోర్టు విచారణకు మంగళవారం ఒక కేసు వచ్చింది. ఈ కేసులో భార్యాభర్తలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. భర్త మంచివాడే అయినప్పటికీ.. భార్య మాత్రం అతడితో జీవితాన్ని కొనసాగించడంలో ఆసక్తిని ప్రదర్శించలేకపోయింది. విడాకులు ఇవ్వాలని అతడిని బెదిరించింది.. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. విచారణ సాగించిన పోలీసులు.. అనేక దఫాలుగా కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ ఆమె ప్రవర్తన మారలేదు. దీంతో అతడు కూడా తట్టుకోలేక విడాకులు ఇవ్వడానికి ఆసక్తి చూపించాడు. ఈ పంచాయతీ ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో మంగళవారం విచారణకు వచ్చింది.
వాస్తవానికి ఆమెతో కలిసి ఉండడానికి ఆ భర్త అనేక దఫాలుగా తన భార్య తరపు వారితో చర్చలు జరిపాడు. అయితే ఆమె మాత్రం ఏకంగా ఐదు కోట్లు కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఇదే విషయాన్ని భర్త తరఫు లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. ఈ కేసును పూర్తిగా విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.. ” మీరు ఆమె దగ్గరికి వెళ్లి తప్పు చేశారు. ఆమెను తిరిగి పిలిస్తే వచ్చే రకం కాదు. ఒకవేళ ఆమె మీ దగ్గరికి వచ్చినా మీతో ఉండే రకం కాదు. ఆమె కలలో చాలా పెద్దదిగా ఉన్నాయి. ఐదు కోట్లు అడగడం దారుణం. ఒకవేళ ఆమె ఇదే తీరు కొనసాగిస్తే మేము ఇచ్చే తీర్పు చాలా కఠినంగా ఉంటుందని” సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు మ్యుటేషన్ సెంటర్లో చర్చించుకోవాలని సూచించింది. ఈ కేసును పార్దివాలా ధర్మాసనం విచారించింది. ” నా భార్య 5 కోట్లు డిమాండ్ చేస్తోంది . నేను 35 నుంచి 40 లక్షల వరకు ఇస్తానని చెప్పాను. ఇప్పటికీ ఒప్పుకోవడం లేదని పార్దివాలా ధర్మసనానికి ఆ భర్త తరపు లాయర్ చెప్పడం విశేషం.