Supreme Court On Divorce: మే డే రోజున సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. విడాకుల మంజూరు పై కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు విడాకుల ప్రక్రియను ధర్మాసనం మరింత సులభతరం చేసింది. అంతేకాదు దంపతులు విడాకుల కోసం ఆరు నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దంపతులు కోరుకుంటే వెంటనే విడాకులు మంజూరు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.. వివాహ బంధాన్ని మెరుగుపరుచుకునేందుకు అవకాశం అని కేసుల్లో వెంటనే విడాకులు మంజూరు చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
ఆర్టికల్ 142 ప్రకారం..
ఆర్టికల్ 142 ప్రకారం ప్రత్యేక అధికారాలు ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ బెంచ్ లో జస్టిస్ కిషన కౌల్, సంజీవ్ ఖన్నా, అభయ్ ఎస్. ఓకా, విక్రమ్ నాథ్, జేకే మహేశ్వరి సభ్యులుగా ఉన్నారు. వీరు తెలిపిన అభిప్రాయాలు ప్రకారం భారతీయ సంస్కృతిలో వివాహం ఒక కట్టుబాటు. ఆడ, మగ మన ఇద్దరినీ ఏకం చేయడం దీని లక్ష్యం. దీని ద్వారా వ్యక్తులు, కుటుంబాలు మంచి మార్గంలో వెళితే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. అని ఒక తంతుగా మాత్రం చూడకుండా ఒక వ్యవస్థగా చూస్తే పది కాలాలపాటు అది చల్లగా ఉంటుంది. అది మెరుగైన దేశం ఏర్పాటుకు సహకరిస్తుంది. ఇలాంటి వివాహ బంధం పటిష్టంగా ఉండేందుకు వీలుగా దీనికంటూ కొన్ని ధర్మాలను పూర్వికులు నిర్దేశించారు. దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థ గొప్పతనం, దాని అవసరం, దాని ఆవశ్యకత నేటి యువతకు తెలియడం లేదు. ఇప్పుడు వివాహ వ్యవస్థ బలంగా ఉందా అంటే? కచ్చితంగా చెప్పలేం. పరిస్థితులు, వ్యక్తులు, వారి మనస్తత్వాలు, ఆర్థిక స్థితులకు ఇచ్చే ప్రాధాన్యాలు పెరిగిపోయాయి.
వ్యక్తికి స్వేచ్ఛ పెరిగింది
“సామాజిక బాధ్యత అనేది నానాటికి మరుగునపడుతోంది. ఈ క్రమంలో వ్యక్తికి స్వేచ్ఛ అనేది ఎక్కువైపోయింది. ఇవి విడాకులకు కారణం అవుతున్నాయి. ఒకరితో మరొకరు సర్దుకోలేకపోవడం, ఆంటీ విషయాల మీద అవగాహన కలిగించే పెద్దలు వారి దరిదాపుల్లో కూడా లేకపోవడం, ఉద్యోగ విషయాల్లో వచ్చిన పెను మార్పులు వివాహ వ్యవస్థను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పైగా రాజీ పడడం అనేది ఒక అసమర్ధత అని నమ్మే పరిస్థితి ఏర్పడటం భార్యాభర్తల మధ్య ఏర్పడుతున్న అగాధలకు ప్రధాన కారణం. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ భార్యాభర్తలు సర్దుబాటు ధోరణితో ముందుకు వెళ్లాలి.. అలాంటప్పుడే వివాహ వ్యవస్థ బలంగా ఉంటుందని” ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రస్తుత యువత వివాహ వ్యవస్థను అంత సీరియస్ గా తీసుకోకపోవడంతో.. విడాకులైనా సులువుగా ఇచ్చేయాలనే నిర్ణయానికి తాము వచ్చామని ధర్మాసనం అభిప్రాయపడింది. కలిసి బతకలేనప్పుడు కలిసి విడిపోవడమే ఉత్తమం అనే తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధర్మాసనం పేర్కొన్నది.. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.