Sukanya Samriddhi Yojana: బాలిక ఆర్థిక భద్రత కోసం కేంద్రం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది. బేటీ బచావో బేటీ పడావో యోజనలో భాగంగా దీనిని అమలు చేస్తున్నారు. ఈ పథకం కేవలం బాలికల కోసం రూపొందించినది. పాప ఏడాది వయసు నుంచి ఈ పథకంలో డబ్బులు పొదుపు చేయవచ్చు. పోస్టాఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరవొచ్చు. ఇందులో 15 ఏళ్లు పెట్టుబడి పెట్టాలి. 21 ఏళ్ల తర్వాత డబ్బులు వస్తాయి. పాపకు 18 ఏళ్లు నిండిన తర్వాత కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఎంత జమ చేయాలి..
ఈ పథకంలో సంవత్సరానికి కనీసం రూ.250 చొప్పున జమచేయాలి. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ పథకంలో వడ్డీ రేటు ప్రస్తుతం 8.2 శాతం ఉంది. వడ్డీ, మెచ్యూరిటీ రాబడిపై మినహాయింపులతోపాటు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80ఛి కింద రూ.1.50 లక్షల వరక మినహాయింపు ఉంటుంది.
లబ్ధి ఇలా..
పాప వయస్సు ఏడాది ఉంటే.. సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచి పాపకు 16 ఏళ్లు వచ్చే వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది. నెలకు రూ.12,500 పొదుపు చేస్తే 15 ఏళ్లకు రూ.22,50,00 పెట్టుబడి అవుతుంది. 21 ఏళ్ల తర్వాత వడ్డీ రూ.46,77,578, అస్సలు రూ.22,50,000 కలిపి మొత్తం రూ. 69,27,578 వస్తాయి. ఒక వేళ నెలకు రూ.5 వేలు పొదుపు చేస్తే 21 సంవత్సరాల తర్వాత రూ. 27,71,031 వస్తాయి.
ఈ ఏడాది కిస్తీ చెల్లించాలి..
అయితే 2023–24 ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఖాతా ఉన్నవారు కనీసం రూ.250 కచ్చితంగా చెల్లించాలి. లేకుంటే ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది. ఖాతాలో ఇంత వరకు రూ.250 కూడా జమ చేయకుంటే మార్చి 31 తర్వాత ఖాతా క్లోస్ చేస్తారు.