Bihar Election 2025: ఒకప్పుడు బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం అలా కాదు. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి.. నవంబర్ మొదటివారం నుంచి మూడు విడతలుగా బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి.. ఎన్నికలు అనగానే సాధారణంగానే కొన్ని సర్వే సంస్థలు సర్వే నిర్వహిస్తుంటాయి. అయితే ఈసారి బీహార్ ఎన్నికల్లో హైదరాబాద్ కు చెందిన ఎస్ ఏ ఎస్ సంస్థ ఆగస్టు 25 నుంచి అక్టోబర్ రెండు వరకు రెండు విడతలుగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్డీఏ, ఆర్జెడి కాంగ్రెస్ వాపక్షాల మహా ఘట్ బంధన్ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోందని సర్వేలో తేలింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 104 నుంచి 116 వరకు వస్తాయని తేలింది. అలాగే మహా ఘట్ బంధన్ కు 125 వరకు స్థానాలు వస్తాయని సమాచారం. ఎన్నికల విహాకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ కి 14 వరకు వస్తాయని సమాచారం. ఇతరులు కూడా 17 వరకు స్థానాలు సంపాదించుకుంటారని సమాచారం.. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ సంస్థ మొదటి విడత సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఎన్డీఏ కూటమి 125 సీట్లు, మహా ఘట్ బంధన్ కు 110 సీట్లు వస్తాయని తేలింది. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ రెండు వరకు తాజా విడుదల సర్వే నిర్వహించగా.. మహా ఘట్ బంధన్ పరిస్థితి మెరుగుపడిందని సమాచారం. సర్వే కోసం ఎస్ ఏ ఎస్ సంస్థ 64,300 సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా
బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్ ఏ ఎస్ సంస్థ సర్వే నిర్వహించింది.. ప్రధానంగా జన్ సూరజ్ పార్టీ చూపించే ప్రభావం, రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళలు ఓటు వేసే విధానం, ముస్లింలు, యాదవుల ఆధిపత్యం, అవినీతి, నిరుద్యోగం, మద్యపాన నిషేధం వంటి అంశాల ఆధారంగా ఈ సర్వే కొనసాగించారు.. ఎమ్మెల్యేలు పనిచేస్తున్న తీరు.. రాజకీయ పరిస్థితులు.. పెట్టుకున్న పొత్తులు.. రాజకీయ బలాలు.. వీటి అన్నిటి ఆధారంగా సర్వే కొనసాగించారు..
రెవెన్యూ డివిజన్లలో..
బీహార్ రాష్ట్రంలో .. పూర్ణియా, శరణ్, తిరుహత్, ముంగీర్, మగధ, కోసి, పాట్నా, భాగల్పూర్, దర్భంగా వంటి డివిజన్లు ఉన్నాయి. ఇందులో తిరు హత్ ప్రాంతంలో 49 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. భాగల్పూర్ ప్రాంతంలో 12 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి.. రాహుల్ నిర్వహిస్తున్న ఓటు చోర్ యాత్ర.. ఈ రాష్ట్రంలో తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని అంటున్నారు.. అయితే రాహుల్ ప్రభావం ఎలా ఉంటుందని అడిగితే 46% మంది యాత్ర ప్రభావం ఉందని చెబుతుంటే.. 39 శాతం మంది లేదని అంటున్నారు. రాహుల్ యాత్ర మహా ఘట్ బంధన్ కు తొమ్మిది శాతం మేలు చేస్తుందని ఓటర్లు అంటున్నారు.. మహిళలకు ఇటీవల నితీష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోజ్ గార్ యోజన పథకం వల్ల 38 శాతం మంది ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామని చెప్పారు.. నితీష్ ప్రభుత్వం పనితీరును మూడు శాతం మంది సూపర్ అని పేర్కొన్నారు..సంతృప్తిగా ఉందని 29 శాతం మంది పేర్కొన్నారు. బాగోలేదని 44 శాతం మంది అన్నారు..