Sidda Ramaiaah : కర్నాటక పీఠముడి వీడింది. సీఎంతో పాటు కేబినెట్ కూర్పు పూర్తయ్యింది. ఫలితాలు వెలువడి రోజులు దాటుతున్నా కాంగ్రెస్ హైకమాండ్ సీఎం అభ్యర్థితో పాటు కేబినెట్ పై కసరత్తు చేస్తునే ఉంది. మాజీ సీఎం సిద్ధారామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సీఎం రేసులో కొనసాగారు. ఇద్దరు బలమైన నేతలు కావడంతో హైకమాండ్ తర్జనభర్జన పడింది. రకరకాల ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయి. చివరకు సీఎం అభ్యర్థితో పాటు డిప్యూటీ సీఎంలు, మంత్రివర్గం కూర్పును పూర్తిచేశారు. సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేయగా.. డీకే శివకుమార్ ను డిప్యూటీసీఎం పదవి వరించింది. ఈ మేరకు గవర్నర్ తవార్ చంద్ గెహ్లట్ కు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమాచారం అందించింది.
కాగా సీఎంతో పాటు నూతన కేబినెట్ గురువారం ప్రమాణస్వీకారం చేయనుంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణస్వీకారం వేడుకలు ప్రారంభంకానున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రతినిధులు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ చర్చోపచర్చల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేశారని తెలుస్తోంది.
కర్నాటక ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడ్డాయి. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 113ను ఆ పార్టీ దాటింది. దీంతో ఎవరి మద్దతు అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, టీపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ గట్టిగానే కృషిచేశారు. నేతలంతా సమన్వయంతో వ్యవహరించడం వల్లే గెలుపు సాధ్యమైంది. అయితే అటు సిద్ధరామయ్య, ఇటు శివకుమార్ ల మధ్య గట్టిపోటీ నెలకొంది. చివరకు సిద్ధరామయ్యకు సీఎం పదవి వరించింది.
కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ గా శివకుమార్ కు పేరుంది. శివకుమార్ తోపాటు దళితులు మైనారిటీలు లింగాయత్ ల నుంచి ఒక్కోరు డిప్యూటీ సీఎంగాలుగా ఉంటారని సమాచారం. కాగా
రాహుల్ గాంధీతోపాటు ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది సిద్ధరామయ్యకు సపోర్టు చేసినట్టు తెలిసిందిజ సోనియా గాంధీతోపాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే… డీకే శివకుమార్ వైపు మొగ్గు చూపారు. అయితే డీకే శివకుమార్ పై ఈడీ సీబీఐ కేసులు ఉండటం ఆయనకు ప్రతిబంధకంగా మారిందని సమాచారం. అటు సిద్ధరామయ్యకు పాలనా అనుభవం కలిసి వచ్చింది. గతంలో ఐదేళ్ల పాలనలో అవినీతి ఆరోపణలు లేకపోవడం ప్లాస్ పాయింట్ గా నిలిచింది. అయితే డిప్యూటీ సీఎంతో పాటు కీలక పోర్టుపోలియో డీకే శివకుమార్ కు కేటాయిస్తారని తెలుస్తోంది,
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Sidda ramaiah had declared as karnataka cm by congress high command
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com