Indian Ocean War: భారత దేశ పేరిట ఉన్న ఏకైక మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఇది బంగాళాఖాతం, అరేబియా సముద్రాలను కలిగి ప్రపంచ వాణిజ్యానికి గుండె. చైనాకు 80% చమురు, జపాన్‌కు 90%, కొరియాకు 98% ఇంధనం ఇక్కడి మార్గాలే. ప్రపంచ సురక్షిత షిపింగ్ 50%, చైనా సరుకులు 60%, గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ 40% ఇక్కడి ఆధారంగా నడుస్తాయి. ఈ మార్గాలు మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుంది.
మూడు కీలక జలసంధులు..
ఈ సముద్రంలో మూడు కీలక జలసంధులు ప్రపంచాన్ని కట్టిపడేస్తాయి. మలాక్కా (2.8 కిమీ వెడల్పు) ఇండోనేషియాలో ఆసియా ఆర్థిక శక్తులకు గేట్‌వే. హార్ముజ్ (33 కిమీ) పర్షియన్ గల్ఫ్‌కు ఆధారం. బాబ్ అల్ మండబ్ (29 కిమీ) అరబ్ దేశాల చమురు మార్గానికి కీ. చైనా ఈ మూడింటినీ పట్టుకోవాలని ఆశిస్తోంది.
చైనా స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్..
భారత చుట్టూ ముత్యాల మాలలా సైనిక స్థావరాలు నడుపుతోంది చైనా. బంగ్లాదేశ్ చిట్టాగాంగ్‌లో ు2 బిలియన్ పెట్టుబడి, నేవీ బేస్. మయన్మార్ జాక్సన్‌విల్ (7.3 బిలియన్ డాలర్లు), కోకో ఐలాండ్‌లో ఫైటర్ రన్‌వే, రాడార్లు. శ్రీలంక హంబంటోటా 99 ఏళ్ల లీజ్, పాక్ గ్వాదర్ 400 కిమీ లైన్. జిబూతి, టాంజానియా (10 బిలియన్ డాలర్లు), కెన్యా పోర్టుల్లో చైనా పట్టు. భారతాన్ని దగ్గర చేయాలనే ఈ వ్యూహం.
భారత్ డైమండ్ నెక్లెస్..
పెట్టుబడులు పోటీపడకుండా భారత్ స్మార్ట్ వ్యూహం అమలు చేస్తోంది. అండమాన్-నికోబార్‌లో రూ.15 వేల కోట్లు, 3 కిమీ రన్‌వే, సబాంగ్ ఐలాండ్ బేస్. అజంశన్ రన్‌వే, ఇరాన్ చాబహార్ రష్యా-యూరప్ లింక్. ఒమాన్, సింగపూర్ స్థావరాలు. ఫ్రెంచ్ రెయూనియన్, అమెరికా డీగో గార్సియా రీఫ్యూలింగ్. మలాక్కా స్ట్రైట్స్‌లో ఇండోనేషియా ఒప్పందాలు, స్నేహ వలయం. 51 దేశాల మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లు, మాల్దీవ్స్-మారిషస్ ట్రైనింగ్ సెంటర్లు చైనా ప్లాన్‌ను డీకోడ్ చేస్తున్నాయి.