Karnataka Govt Ban Ola, Uber: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ సర్వీసులపై నిషేధం విధించింది. రాష్ట్రంలో ఆటో సర్వీసుల తీరుపై రవాణా శాఖకు ఫిర్యాదులు అందడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఆయా సంస్థలు దోపిడీలకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు కిలోమీటర్లకు రూ. 100 లు వసూలు చేయడం వివాదానికి కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులకు నోటీసులు జారీ చేసింది. ప్రయాణికులపై ఇంతటి దోపిడీకి పాల్పడటంపై అందరిలో విస్మయం వ్యక్తమవుతోంది.

ప్రస్తుతం రెండు కిలోమీటర్లకు కనీస ాటో చార్జీని రూ. 30గా ప్రభుత్వం నిర్ణయించింది. తరువాత ప్రతి కిలోమీటర్ కు రూ. 15 చొప్పున వసూలు చేయడానికి అంగీకరించింది. ప్రైవేటు కంపెనీలకు అనుకూలంగా ధరలు పెంచడంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం తీరుపై ఫిర్యాదులు అందాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థల సర్వీసులు నిలిపివేయాలని డిమాండ్ వస్తోంది. ట్యాక్సీలలో కూడా నిర్దేశించిన చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు తెలియడంతో రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కర్ణాటక ప్రభుత్వం ట్యాక్సీలకు 2016 ప్రకారమే లైసెన్సులు జారీ చేసినట్లు రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. ట్యాక్సీలు ప్రయాణికుల నుంచి నిర్దేశించిన ధరలకు మించి ఎక్కువ చార్జీలు వసూలు చేయరాదరని సూచించింది. అలాగే ఆరుగురు ప్రయాణికులకు మించి ఎక్కించుకోవద్దని చెబుతోంది. దీనిపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ అక్కడి ప్రభుత్వం జారీ చేసిన ధరలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో వారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల నుంచి వ్యతిరేకత రావడం గమనార్హం.

ఆటో సర్వీసుల తీరుపై బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. రవాణా శాఖ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ఎంత చెప్పినా వినడం లేదు. దీంతో అధికారుల తీరుపై ఎన్నో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో సర్వీసుల తీరుపై నివేదిక అందజేయాలని రవాణాశాఖ అడిషనల్ కమిషనర్ హేమంత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆటో సర్వీసులపై కఠినతరంగా వ్యవహరించాలని భావిస్తున్నారు.