Rupee: ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బు లేనిదే జీవితం గడిచే పరిస్థితి లేదు. డబ్బు ఉంటేనే ప్రతి వస్తువును కొనుగోలు చేయవచ్చు. తినే ఆహారం కూడా డబ్బుతోనే వస్తుంది. అలా ఎంత డబ్బు ఉన్నా.. దానిని రూపాయి గాని పిలుస్తాం. 100 కోట్ల ఉన్నా.. 100 కోట్ల రూపాయలు అని అంటూ ఉంటాం. అయితే వేరే దేశాల్లో డాలర్ వంటి పేర్లతో పిలుస్తారు. భారతదేశంలో పాటు పాకిస్తాన్, శ్రీలంక వాటి దేశాల్లో కూడా డబ్బులను రూపాయిగానే పిలుస్తారు. ప్రపంచంలో దాదాపు 26 శాతం మంది రూపాయి కరెన్సీని ఉపయోగిస్తారు. అసలు ఈ రూపాయి ఎలా పుట్టింది? ఎవరు దీనిని ప్రామాణికం చేశారు?
పురాతన కాలంలో నాణేల ద్వారా ద్రవ్య మారకం చేసేవారు. అలా నాణేలు జారీ చేసిన మొట్టమొదటి దేశాల్లో భారత్ కూడా ఒకటి. ప్రాచీన భారతదేశంలో వెండితో తయారు చేసిన నాణేలు వాడకలోకి వచ్చాయి. సుమారు మూడవ శతాబ్దంలో వెండితో తయారైన నాణేలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సంస్కృతంలో రూప్య అంటే వెండితో తయారుచేసిన నాణెం అని అర్థం. అప్పుడు దీనిని రూప్య తో పిలిచారు. కాలక్రమేనా ఆకారం, రూపం, పోలిక వంటి పదాలు వాడుకలోకి వచ్చాయి. ఇలా 16వ శతాబ్దంలో షేర్ షా సూరి అనే రాజు అధికారికంగా రూపాయి అని నామకరణం చేశాడు. అప్పుడు చేసిన నామకరణం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది.
ఎన్నికోట్ల డబ్బు ఉన్నా.. రూపాయితోనే ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ రూపాయికి ఎప్పటికీ విలువ తగ్గదు. భారతదేశంలో పాటు నేపాల్, ఇండోనేషియా, మాల్దీవులు, మారిషన్ తోపాటు పాకిస్తాన్, శ్రీలంక దేశాల్లో రూపాయి వాడుతారు. అలాగే బహిరన్, అఫ్గానిస్థాన్, ఒమన్, కువైట్ 20 దేశాలలో ఒకప్పుడు రూపాయి అని పిలిచారు.. ఇప్పుడు రూపియ, రూపీ వంటి పేరుతో పిలుస్తున్నారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ, దేశాభివృద్ధి, ఆధునీకీకరణ తో పాటు ఆర్థిక విలువ ఎలా ఉంది అని రూపాయి నిర్ణయిస్తుంది. ద్రవ్యాలు పలం, వడ్డీ రేట్లు, వాణిజ్య విలువలు, విదేశీ పెట్టుబడులు వంటి అంశాల్లో కూడా రూపాయి కీలకంగా మారుతుంది.
భారతదేశ రూపాయికి ISO 4217 అనే కోడ్ ఉంటుంది. ఒక రూపాయికి 100 పైసలు అని అర్థం. మిగతా దేశాలతో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతోంది. గత నెలలో భారత రూపాయి విలువ 0.34 శాతం బలహీన పడింది. ఏడాది కాలంగా 4.75 శాతం తగ్గింది. అమెరికా డాలర్ ప్రకారం భారత రూపాయి 88.36 కి చేరుకుంది. ఒకప్పుడు ఒక రూపాయి కూడా నోట్ గా వచ్చేది. ఇప్పుడు ఎక్కువగా కాయిన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక రూపాయి నోటుపై భారత ఆర్థిక కార్యదర్శి సంతకం ఉంటుంది. ఎందుకంటే ఈ నోటును ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆ తర్వాత నోట్లను ఆర్బిఐ ద్వారా విడుదల చేస్తారు. అందుకే రూపాయి విలువ ఎప్పటికీ తగ్గకుండా ఉంటుంది.