Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆ మధ్య ఎన్నికల్లో పోటీ చేశారు. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. మా ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి ఎదురైంది. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ తన ధోరణి మార్చుకోలేదు. పైగా జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో ఆయన కేంద్రంలో ఉన్న బిజెపిని టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు. సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ నరేంద్ర మోడీని.. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఆయన ఎండగడుతూ ఉంటారు. వాస్తవానికి ప్రకాష్ రాజ్ గొప్ప వ్యక్తి అయి ఉండి.. గొప్ప మానవతావాది అయి ఉంటే కచ్చితంగా సమాజం ఆయన వెంట ఉండేది. ఆయన వ్యక్తిగత జీవితం.. వృత్తి గత జీవితం వివాదాలమయం కాబట్టి ఒక వర్గం వారు మాత్రమే ఆయనను సమర్థిస్తారు.
ప్రధాని నరేంద్ర మోడీ అంటే చాలు ప్రకాష్ రాజ్ ఒంటి కాలు మీద లేస్తారు. తర్కంతో సంబంధం లేకుండా అడ్డగోలుగా విమర్శలు చేస్తుంటారు. చివరికి ప్రధాని వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలిపెట్టరు. వాస్తవానికి ప్రకాష్ రాజ్ ఈ దేశపు పౌరుడు కాబట్టి.. రాజ్యాంగం ఆయనకు స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి.. ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంటుంది. అలాగని ఏది పడితే అది అడిగేస్తాం.. ఎలా పడితే అలా కడిగేస్తాం అంటే కుదరదు. అందువల్లే ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అని ఏదైనా ట్వీట్ చేస్తే బిజెపి నాయకులు ఖచ్చితంగా ఆయన విమర్శిస్తుంటారు. ఇక జాతీయవాదులు.. ఇతర వ్యక్తులైతే ఓపెన్ గానే ప్రకాష్ రాజ్ కు కౌంటర్లు వేస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో ప్రకాష్ రాజ్ కాస్త వ్యంగ్యాన్ని ఒంట పట్టించుకున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఆయన తన ట్వీట్ లలో చతురతను ప్రదర్శిస్తున్నారు. ఈసారి కూడా నరేంద్ర మోడీని టార్గెట్ చేసి ఆయన ట్వీట్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఇటీవల ప్రకాష్ రాజ్ షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా విమానాశ్రయంలో దిగారు. అక్కడ ప్రధానమంత్రి కటౌట్ ఉంది. అక్కడికి వెళ్ళిన ప్రకాష్ రాజ్ ప్రధాని కటౌట్ వద్ద ఫోటో దిగారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ” నేను విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాను. కానీ ఆయన మాట్లాడలేదు” అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..” మోడీని కలిసేంత సామర్థ్యాన్ని నీకు లేదు. నీ జీవితానికి ఇదే ఎక్కువ” అని కొంతమంది వ్యాఖ్యానిస్తుండగా..” నరేంద్ర మోడీ టెలీ ప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేరు. మీ మీతో అసలు మాట్లాడలేరు. ” అంటూ కొంతమంది ప్రకాష్ రాజ్ కు అండగా నిలుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. చాలామంది ప్రకాష్ రాజ్ తీరును విమర్శిస్తున్నారు.
Met him at the airport.. but couldn’t have a conversation… #justasking pic.twitter.com/YgtxKxKVEy
— Prakash Raj (@prakashraaj) September 21, 2025