కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈరోజు కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ఏడో విడత నిధులను విడుదల చేసింది. దేశంలోని 9 కోట్ల మంది రైతుల ఖాతాలలో 18 వేల కోట్ల రూపాయల నగదును జమ చేసింది. రైతుల ఖాతాలలో ఇప్పటికే నగదు జమైంది. కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఏడాదికి 6 వేల రూపాయలు జమ చేస్తోంది.
Also Read: ఇల్లు లేని వారికి కేంద్రం బంపర్ ఆఫర్.. హోమ్ లోన్ తీసుకుంటే రూ.2.67 లక్షలు తగ్గింపు..?
ఏప్రిల్, ఆగష్టు, డిసెంబర్ నెలల్లో రైతుల ఖాతాల్లో ఈ నగదు జమవుతోంది. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా గతంలో డబ్బులు పొంది ఉంటే పీఎం కిసాన్ వెబ్ సైట్ ను వెళ్లి బేనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా పీఎం కిసాన్ స్కీమ్ నగదు ఏ బ్యాంకు ఖాతాలో జమైందో అనే వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే కేంద్రం కొంతమందికి మాత్రం నగదును జమ చేయలేదు.
Also Read: దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ కోర్సులు నేర్చుకునే ఛాన్స్.?
పొలం ఒకరి పేరుపై ఉండి మరొకరు వ్యవసాయం చేస్తుంటే కేంద్రం డబ్బులు జమ చేయడం లేదని సమాచారం. పంట పండించే రైతుల పేర్లపై పొలం ఉంటే మాత్రమే ఈ స్కీమ్ కు అర్హత పొందే అవకాశం ఉంటుంది. అయితే అర్హత ఉండి ఈ స్కీమ్ నగదును పొందకపోతే మాత్రం 011 – 24300606 ఫోన్ నంబర్ కు కాల్ చేసి నగదు జమ కాకపోవడానికి గల కారణాలను, పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గత రెండేళ్లుగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ను అమలు చేస్తోంది. వ్యవసాయ కార్మికులు మాత్రమే పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో పొందే అవకాశం ఉంటుంది.