PM Modi: అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట వేళ ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం పర్యటించారు. నాసిక్‌లో రోడ్ షో నిర్వహించారు. తర్వాత రాంఘాట్‌కు చేరుకుని గోదావరి నదికి పూజలు చేశారు. అనంతరం చారిత్రక కాలారామ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజారులు, భక్తులతో కలిసి కాసేపు రామ భజన చేశారు.
ఆలయ పరిసరాలు శుభ్రం..
‘స్వచ్ఛత అభియాన్’ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. బకెట్లో స్వయంగా నీళ్లు తెచ్చుకుని కాలారామ్ ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పరిశుభ్రత క్యాంపెయిన్ చేపట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పంచవటిలో సీతారాములు..
నాసిక్ సమీపంలోని పంచవటి ప్రాంతంలో సీతారాములు గడిపారన్న నమ్మకం ఉంది. అందుకే అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు ముందు మోడీ కడిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల అనంతరం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తపోవన్ గ్రౌండ్‌లో నేషనల్ యూత్ ఫెస్టివల్‌ను మోదీ ప్రారంభించారు. ప్రధాని వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఉన్నారు.
మహారాష్ట్ర నాసిక్‌లోని కాలారామ్ ఆలయాన్ని శుభ్రం చేసిన పీఎం నరేంద్ర మోడీ. pic.twitter.com/N1UsvY9v09
— Telugu Scribe (@TeluguScribe) January 12, 2024