HomeజాతీయంCartoonist Satish Chandra: రాముడిని తిట్టి.. అయోధ్యను కించపరచడమే జర్నలిజం అంటే..

Cartoonist Satish Chandra: రాముడిని తిట్టి.. అయోధ్యను కించపరచడమే జర్నలిజం అంటే..

Cartoonist Satish Chandra: అక్కడెక్కడో లెనిన్ పుట్టి.. అక్కడివాళ్ళ సమస్యల పై పోరాడితే ఇక్కడ మనదేశంలో జయంతులు, వర్ధంతిలో నిర్వహిస్తారు. ఎక్కడ డ్రాగన్ దేశంలో మావో గొప్ప పనులు చేశాడని ఇక్కడ సంస్మరణ కార్యక్రమాలు చేపడుతుంటారు. కానీ మన దేశపు ఉదారవాదులకు, ఒక సెక్షన్ పాత్రికేయులకు తెలియనిది ఏమిటంటే రష్యా లో లెనిన్ విగ్రహాలు కూల్చారు. చైనాలో మావో సిద్ధాంతాలను కాలరాశారు. ఈనాటికి మనం గొప్పగా చెప్పుకునే కారల్ మార్క్స్ విధానాలను ఆయన పుట్టిన దేశంలోనే అనుసరించరు. కానీ మనదేశంలో అలా కాదు కదా.. విపరీతమైన ప్రజాస్వామ్యం.. ఎవరిని ఏమైనా అనవచ్చు.. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఈ గాలి పీల్చి, ఇక్కడ నీరు తాగి, ఇక్కడ తిండి తిని, ఇక్కడి ప్రభుత్వం కల్పించే సదుపాయాలు అనుభవించే వారిలో కొందరు అడ్డగోలుగా మాట్లాడుతుంటారు. స్వేచ్ఛ పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు.. సనాతన ధర్మాన్ని, ఇక్కడ తరతరాలుగా ఉన్న ధర్మాన్ని అవమానిస్తూ ఉంటారు.. చివరికి సనాతన ధర్మాన్ని చికెన్ గునియా, డెంగ్యూ జ్వరం లాగా మాట్లాడుతుంటారు.. కానీ వారికి తెలియనిది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఇంతకంటే ఎక్కువగా భారతీయ మూలాన్ని చేరిపివేయాలని ప్రయత్నం చేశారు. కాని చివరికి వారే దేశం వదిలిపెట్టి వెళ్లిపోయారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామనామ స్మరణ మార్మోగిపోతుంది. కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత తన సొంత జన్మభూమిలో రాముడు కొలువు తీరబోతున్నాడు. తాను పరిపాలించిన అయోధ్యలో బాల రాముడిగా భక్తులకు దర్శననివ్వబోతున్నాడు. ఎక్కడైతే తనకు గుడి ఉందో.. అదే స్థలంలో అత్యంత అద్భుతంగా నిర్మించిన గుడిలో అయోధ్య రాముడిగా నెలవై ఉండనున్నాడు. అయితే ఈ కథ వెనుక ఎన్నో కష్టాలు, ఎందరో ప్రాణ త్యాగాలు, మరెందరివో ఆస్తి త్యాగాలు.. పోలీసు దెబ్బలు, రాజ్యం పెట్టిన కేసులు, కోర్టులో విచారణలు.. ఇన్ని ఎదుర్కొని.. కోర్టులో గట్టి వాదనలు వినిపించి చివరికి దేశం మొత్తం పైసా పైసా వసూలు చేసి.. ప్రతి దానికి లెక్క రాసి.. రామ జన్మభూమి పేరుతో ట్రస్ట్ ఏర్పాటుచేసి..రాముడికి ఒక గుడి కట్టించి.. అందులో ప్రతిష్టిస్తే కొంతమందికి కడుపు మండుతోంది.. జర్నలిజం, ఉదారవాదం అనే ముసుగులో హిందూ మతంపై దాడి జరుగుతున్నది. రాముడి విగ్రహ ప్రతిష్టను అభినందించకపోయినా ఇబ్బంది లేదు.. రాముడి గురించి కీర్తించకపోయినా పర్వాలేదు. కానీ వ్యంగ్యంగా కార్టూన్ వేయడం దేనికి?

నేషనల్ మీడియాలో సతీష్ చంద్ర అనే ఓ నెత్తి మాసిన కార్టూనిస్ట్ ఉన్నాడు. గతంలో ఏవో పత్రికల్లో కార్టూన్స్ వేసేవాడు.. మొదట్లో అతడు వేసిన కార్టూన్స్ బాగుండేవి. ఆ తర్వాత అతనిలో ఉదారవాదం పేరుతో ఓ వర్గానికించపరిచే విధమైన ఆలోచన మొదలైంది. ఆ తర్వాత ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ కార్టూన్స్ వేయడం ప్రారంభించాడు.. అది తారస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. అందుకే ఈరోజు రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని ఓ పనికిమాలిన కార్టూన్ తీశాడు. మీడియా రాముడి సేవలో తరిస్తూ.. రాముడి ఆలయానికి విశేషమైన కవరేజీ ఇస్తూ జర్నలిజాన్ని చంపేసిందని.. ఒక మతానికి మీడియా విశేషమైన ప్రాధాన్య ఇస్తోందని.. మండిపడుతూ సతీష్ చంద్ర ఒక కార్టూన్ గీశాడు.. అందులో నలుగురు మీడియా పాత్రికేయులు ఇద్దరు ముందు, ఇద్దరు వెనక నడుస్తూ.. చనిపోయిన జర్నలిజం పాడె మీద మోస్తున్నట్టు సతీష్ చంద్ర కార్టూన్ గీశాడు. పైగా వారు పాడే మోస్తూ రామ్ నామ్ సత్య హై అంటూ నినదిస్తున్నట్టు కార్టూన్ గీశాడు. దేశంలో ఉన్న దారిద్ర్యం, నిరుద్యోగం, ఆశ్రిత పక్షపాతం, మతపరమైన హింస వంటి అంశాలను మీడియా పట్టించుకోవడం లేదని పేర్కొంటూ సతీష్ చంద్ర ఆ కార్టూన్ గీశాడు. ప్రస్తుతం ఈ కార్టూన్ సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ఈ కార్టూన్ పట్ల నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సదరు కార్టూనిస్టు రాముడి విగ్రహ ప్రతిష్టను జీవించుకోలేకపోతున్నారని.. ఒకవేళ అదే స్థానంలో మరొక మతానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగితే ఇలానే కార్టూన్ గీసేవారా అని ప్రశ్నిస్తున్నారు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version