HomeజాతీయంLIC: బీమా సంస్థకు గ్లోబల్‌ గుర్తింపు... ఎల్‌ఐసీ సరికొత్త రికార్డు

LIC: బీమా సంస్థకు గ్లోబల్‌ గుర్తింపు… ఎల్‌ఐసీ సరికొత్త రికార్డు

LIC: భారత దేశంలో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థలలో ఒకటిగా పేరొందింది భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ). తాజాగా ఈ సంస్థ గ్లోబల్‌ గుర్తింపు పొందింది. ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ వరల్డ్‌ వైడ్‌గా 500 అత్యుత్తమ సంస్థలను ప్రకటించింది. ఇందులో భారత ప్రభుత్వ అధీనంలోని ఎల్‌ఐసీకి చోటు దక్కింది. జీవిత బీమా సంస రిలయన్స్‌ ఇండస్ట్రీ లిమిటెడ్‌ కంటే లిస్టులో అగ్రస్థానంలో ఏకైక భారతీయ కంపెనీగా నిలిచింది. భారతీయ సంస్థలలో ఎల్‌ఐసీ అగ్రస్థానంలో ఉంది. ఇక అనిల్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 51 స్థానాలు ఎగబాకింది.

LIC
LIC

98వ స్థానంలో ఎల్‌ఐసీ, 104వ స్థానంలో రిలయన్స్‌..
97.26 బిలియన్ల ఆదాయం , 553.8 మిలియన్ల లాభంతో దేశంలో అతి పెద్ద జీవిత బీమా సంస్థ నిలిచింది. ఫార్చ్యూన్‌ గ్లోబల్‌ జాబితాలో 98వ స్థానంలో ఉంది. 2022 జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 51 స్థానాలు ఎగబాకి 104కి చేరుకుంది. విక్రయాల వారీగా లిస్టెడ్‌ కంపెనీలకు ర్యాంక్‌ ఇచ్చే జాబితాలో ఎల్‌ఐసీ చేరడం విశేషం.

Also Read: Mirror Placement Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాలు ఏ ప్రాంతంలో ఉంచాలో తెలుసా?

యుఎస్‌ రిటైలర్‌ వాల్‌ మార్ట్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో తొమ్మిది భారతీయ కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఐదు ప్రభుత్వ యాజమాన్యం, నాలుగు ప్రైవేట్‌ రంగానికి చెందినవి. గత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓతో వచ్చిన తొలి ఎల్‌ఐసీ మాత్రమే భారతీయ కార్పొరేట్లలో రిలయన్స్‌ కంటే ఉన్నత స్థానంలో నిలిచింది.

LIC
LIC

జాబితాలోని ఇండియన్‌ సంస్థలు..
ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) 28 స్థానాలు ఎగబాకి 142 ర్యాంక్‌ కు చేరుకుంది. ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్జీసీ) 16 స్థానాలు ఎగబాకి 190కి చేరుకుంది. టాటా మోటార్స్‌ 370 , టాటా స్టీల్‌ 435 వ స్థానంలో నిలిచాయి. రాజేష్‌ ఎక్స్‌ పోర్ట్‌ 437 ర్యాంక్‌తో జాబితాలో ఉన్న ఇతర ప్రైవేట్‌ భారతీయ కంపెనీ ఉంది. ఎస్బీఐ 17 స్థానాలు ఎగబాకి 236 ర్యాంక్‌కు చేరుకుంది.

Also Read:AP CM Jagan: జగన్ కొత్త మిషన్.. చంద్రబాబుకే ఎసరు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular