Memes: తెలుగు వారికి హాస్యమంటే ప్రియమే. హాస్యప్రియులు కావడంతో జోక్ లు వేయడం అలవాటే. సమయస్ఫూర్తితో మాటకు మాట అనడం అందరికి చేతకాదు. ఓ సారి ఓ సభలో ఏవండీ మీరు మాల అంటే అవును మాదిగ అని సెటైర్ వేశారట. ఓ వ్యక్తి టేల దగ్గరికి వెళ్లి అరటి గెల మీద చేయి వేసి మాట్లాడితే చేయి తీయి పండ్లు రాలుతాయి అన్నాడట యజమాని దీంతో అతడు సున్నం తక్కువ వేయి దవుడ పగులుతది అని సెటైర్ వేశాడట. మీమ్స్ అంటే సరదాగా వాడుకునే పదాలే కావడం గమనార్హం. దీంతో వాటిని ప్రయోగించే క్రమంలో మనకు సమయస్ఫూర్తి ఉంటే సరిపోతుంది.

మనదేశంలో హాస్యానికి ఎక్కువగానే ప్రాధాన్యం ఇస్తుంటాం. అందుకే చార్లీ చాప్లిన్ అంటే చాలా మందికి ఇష్టమే. ఇక బ్రహ్మానందం కామెడీ అంటే అందరికి ఓ బ్రహ్మాండమైన హాస్యం పండించే నటుడు. దీంతో మనవారు కామెడీకి అంతగా అట్రాక్ట్ అయిపోతారు. దేశంలో తొంభై శాతం మంది మీమ్స్ ను ఇష్టపడుతున్నారు. మీమ్స్ తో తమ పాపులారిటీని పెంచుకుంటున్నారు. కామెడీ ప్రధానంగా సాగే మీమ్స్ తో సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. తమ విలువైన సమయం కేటాయించి యూట్యూబ్ లలో పోస్టులు పెడుతున్నారు.
Also Read: ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: జింబాబ్వేపై గెలిచినా టాప్ లోకి రాని టీమిండియా
దేశంలో మీమ్స్ తో తమ సత్తా చాటుతున్నారు. పలు ప్రశ్నలకు తమదైన శైలిలో సెటైర్లతో సమాధానాలు చెబుతున్నారు. దీంతో తమ ఉనికి చాటుకుంటున్నారు. గత ఏడాది మీమ్స్ ఫాలో అయ్యే వారి సంఖ్య 80 శాతం పెరగడం తెలిసిందే. దీంతో మీమ్స్ అంటే ఎంతలా ఇష్టపడుతున్నారో ఇట్టే అర్థమైపోతోంది. వీటి ద్వారా తమ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. రోజురోజుకు మీమ్స్ ప్రాచుర్యం పొందుతున్నాయి. విశేషమైన ప్రచారం సాగడంతో వీటికి ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు.

సామాజిక మాధ్యమాల ప్రభావం ప్రజల మీద ఎక్కవగానే ఉంది. దీంతోనే మీమ్స్ కు జనాలు బాగా దగ్గరవుతున్నారు. హాస్యమే ప్రధానంగా సాగే మీమ్స్ కోసం ప్రజలు కూడా అలవాటు పడిపోతున్నారు. దీంతో పాపులారీ ప్రధానంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. దీంతోనే మీమ్స్ కు అంతటి ప్రచారం వస్తోంది. ఈ నేపథ్యంలో మీమ్స్ మన వారి ప్రచారం జోరుగానే సాగుతోంది. చాలా మంది వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి వాటి ద్వారా మీమ్స్ ను ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజుకో అరగంట మీమ్స్ కోసమే మనవారు కేటాయిస్తున్నారంటే దానికి ఎంతటి ప్రాచుర్యం వచ్చిందే తెలిసిందే.