https://oktelugu.com/

లాక్ డౌన్లో పెరిగిన ధనవంతుల ఆదాయం

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో దేశంలో పేదల పరిస్థితి దిగజారి పోగా.. ధనవంతుల సంపాదన ఊహించని రీతిలో పెరిగిపోయింది. కరోనా కారణంగా దేశంలో ఆదాయ అసమానతలు మరింత దిగజారాయా..? పేదలు కటిక దరిద్రంలోకి.. ధనవంతుల సంపద రెట్టింపయ్యిందా..? అంటే అవుననే చెబుతోంది.. అక్స్ ఫాం నివేదిక.. కరోనా మహమామరి దేశంలోని ధనవంతులు, కోట్లాది మంది నైపుణ్యం లేని కార్మికుల మధ్య ఉన్న ఆదాయ అసమానతలను మరింత దిగజార్చింది. వీరిలో చాలామంది నిరుద్యోగులుగా మారారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 25, 2021 4:21 pm
    Follow us on

    Wealth
    కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో దేశంలో పేదల పరిస్థితి దిగజారి పోగా.. ధనవంతుల సంపాదన ఊహించని రీతిలో పెరిగిపోయింది. కరోనా కారణంగా దేశంలో ఆదాయ అసమానతలు మరింత దిగజారాయా..? పేదలు కటిక దరిద్రంలోకి.. ధనవంతుల సంపద రెట్టింపయ్యిందా..? అంటే అవుననే చెబుతోంది.. అక్స్ ఫాం నివేదిక.. కరోనా మహమామరి దేశంలోని ధనవంతులు, కోట్లాది మంది నైపుణ్యం లేని కార్మికుల మధ్య ఉన్న ఆదాయ అసమానతలను మరింత దిగజార్చింది. వీరిలో చాలామంది నిరుద్యోగులుగా మారారు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్యాన్ని పొండానికి కష్ట పడుతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. అక్స్ ఫాం నివేదిక సోమవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

    Also Read: అర్నబ్ టీఆర్పీ కోసం అంతపని చేశాడా..?

    వైరస్ అసమానత పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. లాక్ డౌన్ వెళ భారత్ లో బిలీనియర్ల సంఖ్య 35శాతం పెరిగినట్లు అంచనా వేసింది. ఇదే సమయంలో 84శాతం కుటుంబాలు వివిధ రకాల ఆదాయ నష్టాలను చవిచూశాయని తెలిపింది. మార్చి 2020 నుంచి దేశంలోని టాప్ 100 బిలీనియర్ల ఆదాయం పెరిగిందని.. వీరి ఆదాయం 138 మిలియన్ల పేదలకు ఒక్కొక్కరికి 94, 045 చొప్పున ఇవ్వడానికి సరిపోతుందని తెలిపింది.

    Also Read: యువతకు పీఎం సరికొత్త టాస్క్..

    ప్రపంచంలో అతి కఠినమైన లాక్ డౌన్ అమలు చేసిన తరువాత లక్షలాది మంది వలస కార్మికులు, ఉద్యోగులకు ఉపాధి, ఆశ్రయం లేకుండా పోయింది. వందలాది కిలోమీటర్ల దూరంలోని వారి స్వస్థలాలకు కాలి నడకన వెళ్లారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. వారి దీనావస్థను చూసి కంటతడి పెట్టుకోని వారు ఉండరు. అయితే ఎంత మంది వలస కార్మికులు చనిపోయారో తమ వద్ద వివరాలు లేవంటూ.. పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.

    ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్బర్ భారత్ ప్యాకేజీపై కూడా సంస్థ ప్రస్తావించింది. ప్యాకేజీ ప్రత్యక్ష ఆర్థిక ప్రభావం.. రక్షణ రంగంలో ఎఫ్ డై పెంచడం, ప్రయవేటు రంగానికి అంతరిక్ష పరిశోదనలను తెరవడం వంటివి సహా రూ.2 లక్షల కోట్లకు ఎక్కువ అని వ్యాఖ్యానించింది. భారత్ లో టాప్ 11 మంది బిలినియర్లకు మహమ్మారి సమయంలో పెరిగిన సంపదపై ఒకశాతం మాత్రమే.. పన్ను విధించినట్లయితే.. అది జన్ ఔషధి పథకానికి కేటాయింపులు పెంచుతుంది.. ది నాణ్యమైన ఔషధాలను 140 రెట్ల సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతుందని తెలిపింది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    గతేడాది మార్చి18 నుంచి డిసెంబరు 31 మధ్య ప్రపంచ వ్యాప్తంగా బిలినియర్ల సంపద 3.9 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో పేదరికంలో నివసించే ప్రజల సంఖ్య 200 మిలియన్ల నుంచి 500 మిలియన్లకు చేరిందని వివరించింది. ఈ అసమానతలను తగ్గించడానికి భారత ప్రభుత్వం తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపింది. రూ. 50లక్షలకు పైగా సంపాదించిన వారికి రెండు శాతం సర్ చార్జీ విధించాలని, మహమామరి సమయంలో లాభాలు అర్జించే సంస్థలపై తాత్కాలిక పన్ను ప్రవేశ పెట్టాలని కోరింది. మెరుగైన భవిష్యత్ను నిర్మించడానికి భారత ప్రభుత్వం నిర్దిష్ఠ చర్యలు తీసుకోవాలసిన సమయం ఇదని తెలిపింది.